ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోడీ కన్నుమూశారు. ఆమె వయసు 100 ఏళ్లు. హీరాబెన్ మోదీ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. శుక్రవారం ఉదయం సుమారు 3:30 సమయంలో ఆమె కన్నుమూశారని యుఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ బులెటిన్‌లో తెలిపింది. తల్లి మరణంపై ప్రధాని మోడీ ఎమోషనల్ అయ్యారు. ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. “నూరేళ్లు పూర్తిచేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరింది నా తల్లి. ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిది” అని కొనియాడారు. ఈ క్రమంలోనే ఆయన అహ్మదాబాద్‌కు పయనమయ్యారు. అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు బంగాల్ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నా మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఇదిలా ఉంటే.. మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్, పాటు రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి అమిత్ షా మోదీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ కు గాంధీనగర్‌లో అంత్యక్రియలు జరుగనున్నాయి. అంతిమయాత్రలో భాగంగా ప్రధాని మోదీ తన మాతృమూర్తి పాడె మోశారు. అంతిమయాత్ర వాహనంలో అమ్మ పక్కనే కూర్చున్నారు. సన్నిహితులకు మాత్రమే అంతిమక్రియల్లో పాల్గొనేందుకు అనుమతిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరా బెన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపం.. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తల్లి హీరాబెన్ గారి మృతికి సంతాపం తెలుపుతున్నా.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించా…. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. మంత్రి కేటీఆర్ సైతం ప్రధాని తల్లి హీరాబెన్ ఆకస్మిక మృతికి సంతాపం తెలిపారు.
Read Also: Heeraben Modi Last Rites: కాసేపట్లో హీరాబెన్ మోదీ అంత్యక్రియలు
శైశవం నుండే దృఢమైననాయకునిగా పెంచి ప్రజా జీవితంలో మేరు పర్వతం వంటి ఉన్నతమైన వ్యక్తిని బలమైన నాయకుణ్ణి ప్రపంచానికి అందించిన అద్వితీయమైన తల్లి శ్రీమతి హీరాబెన్ ఇక లేరు. వయసు పైబడినా పుట్టినప్పటి నుంచి… ప్రేమ వెలుగులు పరిచిన మాతృ దీపం ఆరిపోయింది మరియు మన ప్రధాని ప్రేమ వెల్లువ కనుమరుగైందన్న వార్త వింటే మా కళ్లలో నీళ్లు తిరిగాయి. దేనినైనా తట్టుకునే శక్తిని మన ప్రధాని నరేంద్ర మోడీ జి కి ఎల్లప్పుడూ ఇచ్చే భగవంతుడు ఇప్పుడు కూడా ఈ మాతృ వియోగాన్ని తట్టుకునే శక్తి ఇచ్చి ఆశీర్వదించాలని ప్రార్ధిస్తున్నాను అన్నారు తెలంగాణ గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీమతి తమిళి సై సౌందరరాజన్.
ప్రధానమంత్రి నరేంద్ర మోది గారి తల్లి హీరాబెన్ మోది గారి మరణించారన్న వార్త తీవ్రంగా బాధించింది. శ్రీమతి హీరాబెన్ గారి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, శ్రీ నరేంద్ర మోడీ గారికి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. ఎంపీ, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ ప్రకటన విడుదల చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోది తల్లి హీరాబెన్ మోది మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నరేంద్ర మోడీ గారు ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలి అని కోరుకుంటున్నాం.హీరాబెన్ గారి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హీరాబెన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తల్లి మరణం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి తీరనిలోటని ఈటల రాజేందర్ అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోది గారి మాతృమూర్తి శ్రీమతి హీరాబెన్ గారు స్వర్గస్తులయ్యారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మొదటి దైవం, తొలి గురువు అయిన తల్లిని కోల్పోతే ఉండే దుఖం నాకు తెలుసు. ఈ బాధాకర సమయంలో ప్రధాని గారికి, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
Read Also: ప్రధాని తల్లి హీరాబెన్ మోడీకి సంబంధించిన విషయాలివే.