Liquor Shops Tenders: రేపటితో ముగియనున్న గడువు.. ఈ సారి టార్గెట్ రూ.2 వేల కోట్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Shops Tenders: తెలంగాణలో మద్యం వ్యాపారం లాభాల పంటగా భావిస్తుంటారు. అందుకే ఈ వ్యాపారానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2021లో మద్యం దుకాణాలు దక్కించుకోడానికి 68 వేలకుపైగా పోటీ పడ్డారు. దరఖాస్తుకు రూ.2 లక్షలు చొప్పున… అప్పట్లో 1357 కోట్లకుపైగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తుల స్వీకరణ ద్వారా…2 వేల కోట్ల ఆదాయాన్ని అర్జించాలని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. తక్కువ దరఖాస్తులు వస్తున్న నిర్మల్, ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు హైదరాబాద్ నుంచి అబ్కారీ శాఖ అధికారులను పంపినట్లు తెలుస్తోంది. గతంలో ఆయా దుకాణాలకు ఎన్ని అర్జీలు వచ్చాయి, ఇప్పుడు ఎన్ని వచ్చాయన్న దానిపై లెక్కలు తీస్తోంది.
Read Also: Steel Flyover: అందుబాటులోకి రానున్న స్టీల్ ఫ్లైఓవర్.. నాయిని పేరు పెట్టిన ప్రభుత్వం
Also Read
- PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్‌లో రోడ్డెక్కిన వేలాది మంది
- IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
- Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల ఏర్పాటుకు…ఈ నెల 4వ నుంచి అర్జీల స్వీకరిస్తోంది ఆబ్కారీ శాఖ. ఆశించినంతగా దరఖాస్తులు రాకపోవడంతో…అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. దీంతో ముందస్తు చర్యలు చేపట్టిన సర్కార్…గతంలో కంటే దాదాపు 30వేల దరఖాస్తులు అదనంగా వస్తేనే..2 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఇప్పటి వరకు 42వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం ఒక్క రోజే 6,523 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. దరఖాస్తుకు 2 లక్షల లెక్కన ఇప్పటి వరకు…800 కోట్లు ఆదాయం వచ్చింది. దరఖాస్తు చేసుకునే వ్యాపారులకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా అబ్కారీ శాఖ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. హైదరాబాద్-80, సికింద్రాబాద్-99, సరూర్‌నగర్-134, శంషాబాద్-100, మల్కాజ్గిరి-88, మేడ్చల్-114 దుకాణాలు లెక్కన మొత్తం 615 మద్యం దుకాణాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
-
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్‌లో రోడ్డెక్కిన వేలాది మంది
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!