NTV Telugu Site icon

Monkeys: అనుమానాస్పద స్థితిలో 100కు పైగా కోతుల మృత్యువాత.. అసలేం జరిగింది?

Monkeys

Monkeys

Monkeys: సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామ శివారులో దాదాపు 100 కోతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మునిగడపకు చెందిన కొందరు గ్రామస్థులు శనివారం తమ పొలాల సమీపంలో కోతులు మృతి చెందడం చూసి స్థానిక అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు పశువైద్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. కోతుల మృతికి గల కారణాలపై ఆ శాఖ అధికారులు ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వెటర్నరీ, పశుసంవర్ధక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే చనిపోయిన కోతుల నమూనాలను కూడా సేకరించారు. నమూనాలను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, నివేదిక వచ్చిన తర్వాత మరణానికి గల కారణాలను నిర్ధారించవచ్చని అధికారులు తెలిపారు.

Also Read: Road Accident: ఒడిశాలో ట్రక్కును ఢీకొన్న బస్సు.. 21 మందికి గాయాలు

అయితే, ఇప్పటి వరకు కోతులను వేరే ప్రదేశంలో విషం పెట్టి చంపి, తమను తాము రక్షించుకోవడానికి, కోతుల మృతదేహాలను గ్రామ సమీపంలో విసిరివేసినట్లు అనుమానిస్తున్నారు. శాంపిల్‌ను పరిశీలించడంతో పాటు పోలీసులు దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి దృశ్యం చూసి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ దారుణం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితి పరిశీలించారు. అలాగే.. స్థానికుల నుంచి సమాచారాన్ని సేకరించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.