Quinton De Kock: డికాక్ సెంచరీల మోత.. సరికొత్త రికార్డు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్డే వరల్డ్ కప్-2023 లో భాగంగా ఈరోజు సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ లక్నో వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ చరిత్ర సృష్టించాడు. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను బ్యాటింగ్ కు పంపింది. ఈ మ్యాచ్ లో డికాక్ మరో సెంచరీ బాదాడు. దీంతో జట్టుకు శుభారంభాన్ని అందించగా.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 29.5వ ఓవర్లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేశాడు.
Botsa Satyanarayana: త్వరలో డీఎస్సీ.. మంత్రి బొత్స కీలక ప్రకటన
Also Read
- CM Chandrababu: వికసిత్ భారత్‌తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
- Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్‌గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
ప్రపంచకప్-2023లో క్వింటాన్ డికాక్ వరుసగా రెండోసారి సెంచరీ సాధించాడు. దీంతో అంతర్జాతీయ వన్డేల్లో 19వ శతకం నమోదు చేశాడు. ఈ సందర్భంగా.. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన సౌతాఫ్రికా క్రికెటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ జాబితాలో దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్(4), హషీం ఆమ్లా(2), ఫాఫ్ డుప్లెసిస్(2), హర్షల్ గిబ్స్(2)లు చేయగా.. డికాక్ కూడా రెండోస్థానంలో నిలిచాడు. అంతేకాకుండా.. సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఓపెనర్‌గా రికార్డ్ నమోదు చేశాడు. ఈ జాబితాలో హషీం ఆమ్లా 27 సెంచరీలు చేసి అగ్రస్థానంలో ఉండగా.. 19 సెంచరీలతో డికాక్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో హర్షల్ గిబ్స్(18)ను అధిగమించాడు.
Vijay Antony: విజయ్ ఫ్యాన్స్ కు చేదు వార్త.. ?
వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా మీద అత్యధిక వ్యక్తిగత స్కోరు(109) సాధించిన తొలి సౌతాఫ్రికా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు హర్షల్ గిబ్స్ 1999లో 101 పరుగులు చేశాడు. ఇప్పుడు డికాక్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. మరోవైపు ఈ జాబితాలో 100 పరుగులతో ఫాఫ్ డుప్లెసిస్(2019) మూడో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాపై డికాక్ ఇది మూడో సెంచరీ. ఈ మ్యాచ్ లో ఎయిడెన్ మార్కరమ్ అర్ధ శతకంతో రాణించగా, కెప్టెన్ బావుమా 35, క్లాసెన్ 29 పరుగులు చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు సాధించింది.
తాజావార్తలు
-
CM Chandrababu: వికసిత్ భారత్‌తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్‌గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!