New Delhi : ఢిల్లీలో ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ హీరో ‘అక్రమ’ ఇల్లు కూల్చివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Delhi : ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డిడిఎ) బుధవారం (ఫిబ్రవరి 28) ఖజూరి ఖాస్ ప్రాంతంలో ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్‌ను ప్రారంభించి అనేక ఇళ్లను కూల్చివేసింది. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ చేపట్టిన కూల్చివేతల కారణంగా నిరాశ్రయులైన వారిలో వకీల్ హసన్ కూడా ఉన్నారు. అతని బృందంతో పాటు ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించినందుకు గత ఏడాది నవంబర్‌లో అతనికి అవార్డు లభించింది. వకీల్ హసన్ వృత్తి రీత్యా ‘ర్యాట్ హోల్ మైనర్’.
Read Also:Daggubati Purandeswari: రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై బీజేపీ మాత్రమే పోరాటం చేస్తుంది: పురందేశ్వరి
Also Read
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
తన ఇల్లు కూల్చివేసిన తర్వాత వకీల్ హసన్ మాట్లాడుతూ.. ‘ఇక మాకు చనిపోవడమే ఆప్షన్. మేము సిల్క్యారా టన్నెల్‌లో 41 మందిని రక్షించాము. అందుకు మాకు ప్రతిఫలంగా ఇది లభించిందని ఆవేదన చెందారు. నేను చాలా బాధగా పడుతున్నాను. ఏమి చెప్పలేను, నాకు ఏమి జరిగిందో మొత్తం సమాజం అర్థం చేసుకోగలదు. దేశం కోసం ఇంత మంచి పని చేశాను. నన్ను నేను పొగుడుకోదలుచుకోలేదు. ఈ పనికి నాకు లభించిన ఫలితం ఏమిటంటే నా ఇంటిని కోల్పవడం. నా పిల్లలు రోడ్డు మీద కూర్చున్నారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? నేడు డబ్బు సంపాదించడం కష్టంగా మారుతోంది. ఇల్లు ఎక్కడ కొనుక్కోగలను ? చనిపోవడమే ఏకైక మార్గం. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఎందుకు పగలగొడుతున్నారని అడిగితే కారణాలు వాళ్లు చూపించలేదు. అందరినీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. 8 గంటల దాకా ఉన్నారు. తన కుమార్తెను, భార్యను కూడా అక్కడే ఉంచాడు. నా కొడుకును కొట్టారు. ప్రపంచం మనల్ని కొనియాడుతోంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాకు రూ.50,000 ఇచ్చింది. కానీ దానితో ఏమి జరుగుతుంది?’ వాపోయారు. అభివృద్ధి పనుల్లో ఆక్రమణ నిరోధక డ్రైవ్ నిర్వహించినట్లు డీడీఏ తెలిపింది. ఈ ఆపరేషన్‌లో అక్రమంగా నిర్మించిన పలు నిర్మాణాలను కూల్చివేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also:Bill Gates : ఛాయ్ వాలాతో బిల్ గేట్స్ జుగల్బందీ.. వైరల్ అవుతున్న వీడియో
#WATCH | Delhi: House of one of the rat miners, who were part of Uttarkashi tunnel rescue operation, razed during an anti-encroachment drive by DDA (28/02) pic.twitter.com/3069wrOAi9
— ANI (@ANI) February 29, 2024
- Tags
- DDA
- delhi news
- uttarakhand
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు