DCP KantiLal Subhash : హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్‌ను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్ రాజు వద్ద నుండి 62 కేజీ ల గంజాయి సీజ్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ మాట్లాడుతూ… అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్ రాజును పట్టుకున్నామని తెలిపారు. గాజువాక చెందిన రాజు ఐస్ క్రీమ్ బిజినెస్ చేస్తున్నాడని, ఈజీ మనీకోసం రాజు గంజాయి పెడ్లర్ గా అవతారం ఎత్తాడన్నారు. మహారాష్ట్ర చంద్రాపూర్ లో మకాం మార్చాడని, చంద్రపూర్ లో పురుషోత్తం అనే వ్యక్తికి ఆర్డర్ పై ఇచ్చేందుకు గంజాయి తీసుకెళ్తున్నాడన్నారు. ఒరిస్సాకు చెందిన సుభాష్ అనే వ్యక్తి వద్ద విక్రయించి తరలిస్తుండగా మాకు సమాచారం రావడంతో పట్టుకున్నామని డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ పేర్కొన్నారు. గంజాయిని తోలుతా ఒరిస్సా నుండి రామగుండం తీసుకవచ్చి అక్కడి నుండి బసు లో హైదరాబాద్ చేరుకున్నాడని, హైదరాబాద్ నుండి చంద్రాపూర్ వెళ్లేందుకు బస్ కోసం చాదర్ ఘాట్ నల్గొండ చౌరస్తాలో అగి ఉన్నాడన్నారు.
Bhumana Karunakar Reddy: టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు..
సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో గంజాయి తరలిస్తున్న రాజు అదుపులోకి తీసుకున్నామన్నారు. రాజు ఈజీ మనీ కోసం గంజాయి సరఫరా చేస్తున్నాడని, గతంలో గంజాయి సరఫరా చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తెలంగాణాలోని పాల్వంచ పోలీస్ స్టేషన్లలో ఇతనిపై పలు కేసు లు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. గతంలో వరుస గంజాయి కేసులలో జైలుకు వెళ్లిన రాజు తన బుద్ధి మాత్రం మారలేదన్నారు. గంజాయి పెడ్లర్ రాజు కాల్ డేటా, రిసీవర్లు ఎవరు. మెయిన్ పేడ్లర్ ఎంత మంది. సబ్ పెడ్లర్లు ఎవరు విరి నెట్ వర్క్ పై వివిధ కోణాల్లో9 విచారణ జరుపుతున్నామని డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ తెలిపారు.
Uttam Kumar Reddy : సర్వమత సమ్మేళనానికి ప్రతీక జాన్ పహాడ్ దర్గా ఉర్సు