NTV Telugu Site icon

AAP: ఢిల్లీలో నీటి సంక్షోభానికి బీజేపీ కుట్ర

Athish

Athish

రెండ్రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం.. కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఢిల్లీలో నీటి సంక్షోభం సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఢిల్లీ జలవనరుల మంత్రి ఆతిషి ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే పక్కన హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి నీటి సరఫరాను నిలిపివేసిందని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Manam Re-Release : “మనం” మాకెంతో స్పెషల్ మూవీ..నాగార్జున స్పెషల్ వీడియో వైరల్..

లోక్‌సభ ఎన్నికల ప్రకటన వచ్చిన దగ్గర నుంచి ఆప్‌ను బీజేపీ టార్గెట్ చేసుకుందని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన ఐదురోజులకే ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని చెప్పారు. ఇక మధ్యంతర బెయిల్ వచ్చాక.. స్వాతి మాలివాల్‌ను అడ్డంపెట్టుకుని కేసులో ఇరికించడానికి యత్నించారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆ ప్లాన్ కూడా సక్సెస్ కాకపోవడంతో విదేశీ నిధుల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. అది కూడా వర్క్‌వుట్ కాకపోవడంతో హర్యానా ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని డిల్లీకి నీటి సరఫరాను నిలిపివేశారని అతిషి ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: Double Ismart : ‘డబుల్ ఇస్మార్ట్’ మేకింగ్ వీడియో అదిరిపోయిందిగా..

మే 25న ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు కుట్రలు చేస్తూనే ఉంటారని మంత్రి చెప్పుకొచ్చారు. ఓటర్లను గందరగోళానికి గురి చేయడానికే ఈ కుట్రలు చేస్తున్నారని మంత్రి అతిషి మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఢిల్లీలో నీటి సంక్షోభం సృష్టించారని మంత్రి ఆరోపించారు. హర్యానా ప్రభుత్వానికి లేఖ రాస్తున్నామని.. స్పందించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Kumaraswamy: ప్రజ్వల్ రేవణ్ణకు బాబాయ్ విజ్ఞప్తి.. ఏం సలహా ఇచ్చారంటే..!