Dawood Ibrahim: పాకిస్థాన్‌లో దావూద్ ఇంకా ఫుల్ యాక్టివ్.. మాజీ ఎఫ్‌బీఐ ఏజెంట్ బయటపెట్టిన సంచలన నిజాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dawood Ibrahim: అండర్‌వరల్డ్ డాన్ (Underworld Don), గ్లోబల్ టెర్రరిస్ట్ (Global Terrorist) దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అనే విషయాలు ఎవ్వరికీ తెలియదు. దావూద్ స్థావరంపై తాజాగా ఓ సంచలన నిజం బయటపడింది. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ (FBI) కోసం పనిచేసిన పాకిస్థాన్ మూలాలున్న అమెరికన్ పౌరుడు కమ్రాన్ ఫరీదీ, దావూద్ రహస్య స్థావరాలు (Hideouts), అతని భద్రత, విలాసవంతమైన జీవితంపై షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. ఓ పాడ్‌కాస్ట్ (Podcast) ఇంటర్వ్యూలో దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని కమ్రాన్ స్పష్టం చేశాడు. అంతేకాదు, దావూద్‌కు అక్కడ మూడు రహస్య స్థావరాలు ఉన్నాయని చెబుతూనే, 2018లో దావూద్ అత్యంత సన్నిహితుడు జాబిర్ మోతీవాలా అరెస్ట్ వెనుక తన పాత్ర ఏంటో కూడా మొదటిసారి కెమెరా ముందు ఒప్పుకున్నాడు.
యూకే (UK), యూఏఈ (UAE) సహా ప్రపంచవ్యాప్తంగా దావూద్ ఆర్థిక లావాదేవీలను (Financial Network) చూసుకునే పాకిస్థానీ జాబిర్ మోతీవాలాను 2018లో లండన్‌లో తానే అరెస్ట్ చేయించానని కమ్రాన్ తెలిపాడు. జాబిర్ను అమెరికాకు రప్పించి, దావూద్‌కు, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు (Lashkar-e-Taiba) మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలను కోర్టులో నిరూపించడమే ఎఫ్‌బీఐ అసలు ప్లాన్. అయితే, అమెరికా కోర్టులో ఈ కేసుపై కమ్రాన్ సాక్ష్యం చెప్పాల్సి ఉండగా, అతను వెనక్కి తగ్గాడు. పాకిస్థాన్‌లో ఉన్న తన కుటుంబానికి ఐఎస్ఐ (ISI) సాయంతో దావూద్ హాని తలపెడతాడన్న భయంతోనే తాను సాక్ష్యం చెప్పలేదని, ఇదే అదునుగా దావూద్ తన అనుచరుడు జాబిర్ను తిరిగి పాకిస్థాన్‌కు రప్పించుకున్నాడని కమ్రాన్ వివరించాడు. అయినప్పటికీ, కమ్రాన్ తన అమెరికన్ భార్యతో కలిసి పాకిస్థాన్ వెళ్లినప్పుడు దావూద్, జాబిర్ కలిసి ఐఎస్ఐ సాయంతో అతడిని అరెస్ట్ చేయించి నెలల తరబడి జైల్లో పెట్టించారు. కేవలం అమెరికా పౌరసత్వం (US Citizenship) ఉండటం వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని, ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో తలదాచుకుంటున్నానని కమ్రాన్ పేర్కొన్నాడు.
Also Read
- CM Revanth Reddy: క్యూర్, ప్యూర్, రేర్.. తెలంగాణ సమగ్రాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి మూడు రీజియన్ల ఫార్ములా..
- Azam Khan Released From Jail: ఇక ఎన్నికలు కాదు.. విప్లవమే వస్తుంది! అజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు
- Nasha MuktBharat: డ్రగ్స్ మహమ్మారిపై సమరశంఖం.. 'నషా ముక్త్ భారత్ యాత్ర'కు కింగ్ నాగార్జున మద్దతు..
- Punjab: ఒక్కసారిగా కూలిన ఇనుప వంతెన.. కాలువపై చిక్కుకున్న రెండు భారీ లారీలు
ఓవైపు ముంబైలోని దావూద్ పాత ఇల్లు ‘ముసాఫిర్ ఖానా’ను బీఎంసీ (BMC) అధికారులు కూల్చివేస్తున్న సమయంలోనే, పాకిస్థాన్‌లో దావూద్ ఇంకా పూర్తి యాక్టివ్‌గా (Active) ఉన్నాడని కమ్రాన్ చెప్పడం గమనార్హం. ‘ధురంధర్’ సినిమాలో దావూద్‌ను ఓ నిస్సహాయుడైన ముసలివాడిగా చూపించడం పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశాడు. దావూద్ తనకంటే చాలా చిన్న వయసున్న అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడని, బయటకు ఎంతో మతభక్తి ఉన్నవాడిలా నటిస్తూనే లోపల విపరీతమైన విలాసాలకు, ముజ్రా (Mujra) పార్టీలకు బానిసయ్యాడని బాంబు పేల్చాడు. తాను స్వయంగా దావూద్‌తో కలిసి ఎన్నో పార్టీలకు వెళ్లానని, దావూద్ ఇప్పుడు కొకైన్ (Cocaine) డ్రగ్స్ తీసుకుంటున్నాడని కమ్రాన్ వెల్లడించాడు. అంతేకాదు, భారత్, పాకిస్థాన్లలో దావూద్ గ్యాంగ్ భారీ ఎత్తున డ్రగ్స్ దందా (Drugs Business) నడుపుతోందని తెలిపాడు.
కరాచీ (Karachi) రోడ్లపై దావూద్ పగటిపూట అస్సలు బయటకు రాడని, కేవలం రాత్రివేళల్లో మాత్రమే సంచరిస్తాడని కమ్రాన్ చెప్పాడు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ దావూద్ వెంటనే తన స్థావరాన్ని మార్చేస్తుంటాడని వెల్లడించాడు. దావూద్, అతని కుడిభుజం ఛోటా షకీల్ (Chhota Shakeel) వాడటానికి దుబాయ్ నుంచి ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ కార్లను (Bulletproof Cars) తెప్పించుకున్నారని వివరించాడు. దావూద్ భద్రతకు పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఎస్ఎస్జీ కమాండోలు (SSG Commandos) కాపలాగా ఉండగా, మొత్తం సెక్యూరిటీ పర్యవేక్షణను ఛోటా షకీల్ చూసుకుంటాడని చెప్పాడు. ప్రతి శుక్రవారం ఛోటా షకీల్ నేరుగా ఐఎస్ఐ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లి దావూద్ భద్రతకు సంబంధించిన పూర్తి రిపోర్ట్ అందిస్తాడట. పాకిస్థాన్ రాజకీయాల్లో దావూద్ పలుకుబడి ఏ స్థాయిలో ఉందంటే, ఒకసారి రాత్రిపూట ఆసిఫ్ అలీ జర్దారీకి నేరుగా ఫోన్ చేసి తన పని చేయించుకున్నాడని కమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇవన్నీ ఒక ఎత్తయితే, దావూద్ తన ప్రతి పనిలోనూ మూఢనమ్మకాలను పాటిస్తాడని తెలుస్తోంది. దావూద్ గతంలో ముంబై నుంచి ‘ఇస్లాం బాబా’ అనే ఓ ఫకీర్‌ను పాకిస్థాన్‌కు తీసుకెళ్లాడని, ఆ బాబా అనుమతి లేకుండా దావూద్ కానీ, అతని గ్యాంగ్ కానీ ఏ పనీ చేయరని కమ్రాన్ తెలిపాడు. మరోవైపు 1993 ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారి టైగర్ మెమన్ (Tiger Memon) కూడా పాకిస్థాన్‌లోనే ఉంటూ తన వ్యాపారాలు చేసుకుంటున్నాడని, అయితే దావూద్, ఛోటా షకీల్ అతనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని ఈ మాజీ ఎఫ్‌బీఐ ఏజెంట్ అసలు గుట్టు విప్పాడు.
తాజావార్తలు
-
Dawood Ibrahim: పాకిస్థాన్‌లో దావూద్ ఇంకా ఫుల్ యాక్టివ్.. మాజీ ఎఫ్‌బీఐ ఏజెంట్ బయటపెట్టిన సంచలన నిజాలు
-
Itel City 300 5G: కొత్త కలర్ వేరియంట్లలో itel City 300 5G లాంచ్.. 13MP కెమెరా, 5000mAh బ్యాటరీ!
-
Aditya Dhar: రణ్వీర్ సింగ్‌తోనే ఆదిత్య ధర్ మూవీ.. ఈసారి మరో డ్రీమ్ ప్రాజెక్ట్!
-
CM Revanth Reddy: క్యూర్, ప్యూర్, రేర్.. తెలంగాణ సమగ్రాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి మూడు రీజియన్ల ఫార్ములా..
-
Azam Khan Released From Jail: ఇక ఎన్నికలు కాదు.. విప్లవమే వస్తుంది! అజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!