NTV Telugu Site icon

Dasoju Sravan: మోడీ- రేవంత్ రెడ్డి మధ్య ఇదంతా పొత్తుకు నిదర్శనం..

Dasoju Sravan

Dasoju Sravan

సీఎం రేవంత్ రెడ్డి- ప్రధాని మోడీని బడా భాయ్ అని చెప్పి గుజరాత్ మోడల్ తెలంగాణలో అమలు చేస్తా అంటున్నాడు అని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇంచార్జ్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. తెలంగాణను గుజరాత్ మోడల్ అంటున్నావు మరొక గోద్రా కావాలా? అని ప్రశ్నించారు. మోడీకి – రేవంత్ కు మధ్య జుగల్ బంద్ ఏందో తెలియాలి.. రాహుల్ ఏమో మోడీని వ్యతిరేకిస్తే.. రేవంత్ మోడీని సహాయ సహకారాలు  అడగడం ఏంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడీ, రేవంత్ రెడ్డి మధ్య ఇదంతా పొత్తుకు నిదర్శనం అన్నారు. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని నిస్సిగ్గుగా రేవంత్ మాట్లాడ్తున్నారు.. రేవంత్ రెడ్డి ప్యాతలాజికల్ లాయర్ అని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.

Read Also: PSL 2024: వావ్ సూపర్ క్యాచ్.. బాల్‌ బాయ్‌ను హగ్‌ చేసుకున్న స్టార్‌ బ్యాటర్‌..

గతం ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు మాట్లాడ్తున్నారు అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తరవాత జాబులు క్రియేట్ చేసి ఇస్తాం అన్నారా.. రిక్రూట్మెంట్ మధ్యలో ఉన్నవి కల్పి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. స్టాఫ్ నర్స్ల ఉద్యోగాలు నేనే ఇచ్చిన అని అబద్ధాలు చెప్తున్నారు.. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకోవడం నయవంచన కాదా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం కుంగుబాటుపై సీఎం రేవంత్ రెడ్డి బట్టకాల్చి మీదేస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వంకు సిగ్గు శరం లేదు అంటూ మండిపడ్డారు. పాత నోటిఫికేషన్ లకు మరి కొన్ని జాబులు కలిపి ఉద్యోగాలు ఇస్తున్నామని నిరుద్యోగులను మోసం చేస్తున్నారు.. గత ప్రభుత్వం గొర్రులు, బర్లు, చేపలు ఇస్తే కాంగ్రెస్ ఉద్యోగాలు ఇస్తుంది అని వ్యాఖ్యానించారు.. గొర్రులు, బర్లు, చేపల పెంపకం దారులను చిన్న చూపు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అని దాసోజు శ్రవణ్ ఆరోపించారు.