తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు దర్శకుడు దశరథ్. సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి కమర్షియల్ సక్సెస్ లను అందుకున్నారు దశరథ్.అయితే ఆయన తెరకెక్కించిన కొన్ని సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.తాజాగా ఒక ఇంటర్వ్యూ లో దశరథ్ షాకింగ్ విషయాలను వెల్లడించినట్లు సమాచారం..ప్రభాస్ మరియు మంచు మనోజ్ గురించి ఈ స్టార్ డైరెక్టర్ ఎంతో గొప్ప గా చెప్పుకొచ్చారు.త్రివిక్రమ్ పోసాని వంటి వారితో ఇప్పటికీ నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు..సంతోషం, సంబరం మరియు స్వాగతం టైటిల్స్ ఫస్ట్ లెటర్ గురించి దశరథ్ చెబుతూ ‘స’అనే అక్షరం నాకు సెంటిమెంట్ ఏమి కాదని ఆయన కామెంట్లు కూడా చేశారు. జయం మరియు దిల్ సినిమా హిట్ కావడం తో సంబరం స్క్రిప్ట్ లో మార్పులను చేశామని దశరథ్ చెప్పుకొచ్చారు.ఆ మార్పులే సినిమా ఫ్లాప్ కు కారణమని కూడా ఆయన పేర్కొన్నారు.
మనోజ్ తో శ్రీ అలాగే శౌర్య సినిమాలని తెరకెక్కించానని రెండు సినిమాల ఫ్లాప్ కు నేనే కారణమని దశరథ్ చెప్పుకొచ్చారు.శౌర్య సినిమా సక్సెస్ సాధిస్తుందని నేను అనుకున్నాను.కానీ సినిమా ఊహించని విధంగా ఫ్లాపైందని ఆయన తెలిపారు. ప్రభాస్ మరియు మనోజ్ తో నేను ఎప్పుడూ టచ్ లో ఉంటానని ఆయన తెలిపారు.నాకు కనుక కొడుకు పుడితే కచ్చితంగా మనోజ్ లా ఉండాలని అయితే నేను కోరుకుంటానని దశరథ్ చెప్పుకొచ్చారు.. మనోజ్ మంచి వ్యక్తిత్వం కలవాడని దశరథ్ అన్నారు.అయితే మనోజ్ కు నేను హిట్ ఇవ్వలేకపోయినందుకు ఎంతో బాధగా ఉందని కూడా ఆయన తెలిపారు.. ఆయన వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా లో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. లవ్ యు రామ్ సినిమా ప్రమోషన్స్ లో భాగం గా దశరథ్ ఈ విషయాలను చెప్పుకొచ్చారు.త్వరలోనే మనోజ్ తో మరో సినిమాను తెరకెక్కించి ఈ సారి కచ్చితంగా మంచి హిట్ ను ఆయనకు అందిస్తానని తెలిపారు దశరథ్..