NTV Telugu Site icon

Damodara Raja Narsimha : బీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క హాస్పిటల్‌లో కూడా ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకురాలేదు

Damodara Raja Narsimha

Damodara Raja Narsimha

బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు పై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్, పేట్లబుర్జు హాస్పిటల్, వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్‌లో ఐవీఎఫ్ సెంటర్ల ఏర్పాటుకు 06/09/2018న జీవో 520 విడుదల చేశారని, కానీ, ఒక్క హాస్పిటల్‌లో కూడా ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకురాలేదని ఆయన మండిపడ్డారు. పేట్లబుర్జు, ఎంజీఎంలో పైసా పనిచేయలేదు. ఒక్క పరికరం కూడా కొనుగోలు చేయలేదని, 2023లో ఎన్నికలకు ముందు గాంధీకి కొన్ని ఎక్విప్‌మెంట్ తీసుకొచ్చి, ఐవీఎఫ్ సేవలను ప్రారంభిస్తున్నట్టు హడావుడి చేశారని ఆయన వ్యాఖ్యానించారు. కానీ.. ఎంబ్రయాలజిస్ట్‌ను, స్టాఫ్‌ను నియమించలేదు. అవసరమైన అనుమతులు తీసుకోలేదని, ఐవీఎఫ్ చేయడానికి అవసరమైన కెమికల్స్, మెడిసిన్ కొనడానికి నిధులు మంజూరు చేయలేదన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ.

Lowest Score In Test cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో సొంత మైదానంలో 10 అత్యల్ప స్కోర్లు..

అంతేకాకుండా..’ఇవన్నీ మా ప్రభుత్వం వచ్చాక అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎంబ్రయాలజిస్ట్‌ను నియమించాం. ట్రైన్‌డ్ స్టాఫ్‌ను అలాట్ చేశాం. నిధులు కేటాయించాం. అవసరమైన అనుమతులు తీసుకొచ్చి, ఐవీఎఫ్ సేవలను ప్రారంభించాం. మేము చిత్తశుద్ధితో ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తే, దాన్ని మీఖాతాలో‌ వేసుకునేందుకు చవకబారు‌ విమర్శలు‌ చేస్తున్నారు. సిగ్గు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మీకు దమ్ముంటే మీ హయాంలో గాంధీలో ఒక్కరికి ఐవీఎఫ్ చేసినట్టు నిరూపించండి. పేట్లబుర్జు, ఎంజీఎంలో ఐవీఎఫ్ సెంటర్లు ఎక్కడున్నాయో చూపించండి. లేదా, ఇకనైనా ఇలాంటి చవకబారు‌ ఆరోపణలు మానుకోండి‌. ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకురాకుండా, మాతృత్వం కోసం తపిస్తున్న మహిళలను మోసం చేసినందుకు వారికి బహిరంగ క్షమాపణలు చెప్పండి.’ అని మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు.

Minister Narayana: ఫ్లెక్సీలు, పోస్టర్లను నిషేధిస్తున్నాం.. త్వరలోనే చట్టాన్ని తీసుకువస్తాం..