Manchu Lakshmi: ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు గురించి కానీ, ఆయన ఫ్యామిలీ గురించి కానీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విష్ణు, లక్ష్మీ, మనోజ్ ముగ్గురు చిత్ర పరిశ్రమలో ఉన్నవారే. ఇక సోషల్ మీడియాలో వీరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ముఖ్యంగా లక్ష్మీ, విష్ణు.. వీరు ఏం మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక మంచు మనోజ్ గురించి అందరికి తెల్సిందే. ఏదైనా ముఖం మీద మాట్లాడే మనస్తత్వం. అక్క, అన్నలా కాకుండా కొద్దిగా ఆలోచించి మాట్లాడే టైప్ అని అభిమానులు చెప్పుకొస్తూ ఉంటారు. ఇక మనోజ్.. భూమా మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకుంటున్న విషయం విదితమే.
కొన్నేళ్ల క్రితం మొదటి భార్య ప్రణీత కు విడాకులు ఇచ్చేసిన మనోజ్, మౌనికాతో రిలేషన్ లో ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. అయితే మోహన్ బాబు ఫ్యామిలీకి ఈ వివాహం చేయడం ఇష్టం లేదని, అయినా మనోజ్ పట్టుబట్టడంతో ఇంట్లో ఆస్తి వివాదాలు కూడా తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మంచు మనోజ్ పెళ్లిపై మొదటిసారి అక్క మంచు లక్ష్మీ నోరు విప్పింది. “మనోజ్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. ఆయన త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏమిటి?” అన్న ప్రశ్నకు లక్ష్మీ మాట్లాడుతూ “ఎవడి దూల వాడిది.. ఎవరి బ్రతుకు వారిని బ్రతకనివ్వండి. మనోజ్ నిస్వార్థమైన, నిజాయతీ కలిగిన ప్రేమను కనుక్కున్నాడు. అతడు అలాంటి ప్రేమను పొందినందుకు నేను చాలా సంతోషిసున్నాను. మనోజ్ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను”అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.