NTV Telugu Site icon

Dalai Lama: చంద్రయాన్-3 ల్యాండింగ్‌పై ప్రధాని మోడీ, ఇస్రోను అభినందించిన దలైలామా

Dalai Lama

Dalai Lama

Dalai Lama: భారతదేశం బుధవారం చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర రోవర్‌ను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా అవతరించింది. ఈ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రశంసించారు. చంద్రయాన్‌-3 విజయవంతమైనందుకు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభినందించారు. విక్రమ్ ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండింగ్ చేసి శాస్త్రీయ అభివృద్ధికి కృషి చేసిన భారత శాస్త్రజ్ఞులకు ఆయన అభినందనలు తెలిపారు.

Read Also: ISRO EX Chairman: ఇస్రో శాస్త్రవేత్తల జీతంపై మాజీ ఛైర్మన్ ఏమన్నారంటే..!

ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్, ఏజెన్సీలోని శాస్త్రవేత్తల బృందాన్ని కూడా ప్రశంసించారు, భారతదేశం శాస్త్రీయ, సాంకేతిక పరిపక్వతను ప్రదర్శించే లక్ష్యంతో ఈ మిషన్‌లో పనిచేశారని కొనియాడారు. “మిషన్‌ను సాధ్యం చేసిన వారి అంకితభావానికి ఇస్రో అధిపతి, అతని బృందాన్ని నేను అభినందిస్తున్నాను. వారు భారతదేశ శాస్త్రీయ, సాంకేతిక పరిపక్వతను ప్రదర్శించారు” అని ఆధ్యాత్మిక నాయకుడు చెప్పినట్లు ప్రకటన పేర్కొంది. “భారతదేశంలో ఎక్కువ కాలం గడిపిన అతిథిగా, ఈ గొప్ప విజయానికి నేను సంతోషిస్తున్నాను. భారత వైజ్ఞానిక పరిశోధనా సంస్థ తదుపరి శాస్త్రీయ ప్రయత్నాలలో తన నాయకత్వ పాత్రను బలోపేతం చేయడానికి కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను.” అని దలైలామా అన్నారు. ప్రార్థనలు, శుభాకాంక్షలతో ఆయన తన సందేశాన్ని ముగించారు.

Read Also: Viral Video: మేం ఆల్రెడీ చంద్రుడి మీదే ఉన్నాం.. చంద్రయాన్-3పై పాకిస్థాన్‌ యువకుడి ఫన్నీ కామెంట్

అంతరిక్షంలోకి 40 రోజుల ప్రయాణం తర్వాత చంద్రయాన్-3 ల్యాండర్ ‘విక్రమ్’ బుధవారం చంద్ర దక్షిణ ధృవాన్ని తాకింది. అలా చేసిన మొదటి దేశంగా భారతదేశం నిలిచింది. యూఎస్, రష్యా, చైనా తర్వాత చంద్రుని ల్యాండింగ్ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించిన నాల్గవ దేశంగా భారతదేశం నిలిచింది. ఈ వ్యోమనౌకను సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించిన సంగతి తెలిసిందే.