Site icon NTV Telugu

Jayashankar Bhupalpally: ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లోకి బర్రెలను తోలిన పాడిరైతు.. ఎందుకంటే..?

Bhupalapally

Bhupalapally

Jayashankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పాడిరైతు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. భూపాలపల్లిలో నియోజకవర్గంలో ఒక వ్యక్తి బర్రెల షేడ్‌ను కూలగొట్టారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోకి బర్రెలను తోలాడు. దీంతో క్యాంపు కార్యాలయంలో ఉన్న నేతలు, కార్యకర్తలు, ప్రజలు గందరగోళానికి గురయ్యారు. పోలీసుల వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే..

READ MORE: Nara Lokesh: ప్రభుత్వం మారిపోతుందని ఈ-మెయిల్‌ పంపారు.. ఎవరా అని చూస్తే..!

పాడి రైతు కూరాకుల ఓదెలు తన బర్రెల కోసం ఓ షెడ్డును ఏర్పాటు చేసుకున్నాడు. ఎమ్మెల్యే అనుచరులు దాన్ని కూల్చివేశారు. దీంతో ఆవేదనకు గురైన ఓదెలు ఏకంగా జిల్లా కేంద్రంలోని క్యాంపు ఆఫీసులోకి బర్రెలను తోలాడు. ఒక్కసారిగా క్యాంప్ ఆఫీస్ లోకి గేదలు రావడంతో అందరూ హైరానా పడ్డారు. కార్యకర్తలు.. పోలీసులు వాటిని బయటకు పంపించేశారు. అక్కడే తనకు న్యాయం కావాలంటూ ఓదెలు కుటుంబ సమేతంగా నిరసనకు దిగారు. “ఒక్కగానొక్క షెడ్డును కూల్చేశారు. నా బర్రెలను ఎక్కడ కట్టేసుకోవాలి. ఎమ్మెల్యే ఈ అంశంపై స్పందించాలి. నాకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి” అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే అధికారిక నివాసంలోకి పశువులను పంపిన ఓదెలును ఆయన భార్యను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

READ MORE: GHMC Raids: ఈ- కామర్స్ స్టోర్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. ఈగలు, దోమలతో..

Exit mobile version