Jayashankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పాడిరైతు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. భూపాలపల్లిలో నియోజకవర్గంలో ఒక వ్యక్తి బర్రెల షేడ్‌ను కూలగొట్టారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోకి బర్రెలను తోలాడు. దీంతో క్యాంపు కార్యాలయంలో ఉన్న నేతలు, కార్యకర్తలు, ప్రజలు గందరగోళానికి గురయ్యారు. పోలీసుల వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే..
హబ్సిగూడ జీహెచ్‌ఎంసీ వార్డ్ ఆఫీస్ ను తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు ఉప్పల్ బేతి సుభాష్ రెడ్డి. గతంలో ఎమ్మెల్యే భార్య బేతి స్వప్న హబ్సిగూడ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు అక్కడే కలిసి పనిచేసారు ఎమ్మెల్యే, కార్పోరేటర్. కానీ ప్రస్తుతం హబ్సిగూడ కార్పొరేటర్ గా బీజేపీ అభ్యర్థి చేతన ఉన్నారు. దాంతో ఉప్పల్ జీహెచ్‌ఎంసీ అధికారులు వార్డ్ ఆఫీస్ మాకు ఇవ్వాలని కోరినా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. దాంతో చెట్టు కింద విధులు నిర్వహిస్తున్నారు బీజేపీ…