Purandeswari Delhi Tour: చివరి నిమిషంలో నంద్యాల పర్యటన రద్దు.. ఢిల్లీకి పురంధేశ్వరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Purandeswari Delhi Tour: ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది.. ఈ తరుణంలో చివరి నిమిషంలో నంద్యాల పర్యటన రద్దు చేసుకున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. ఢిల్లీ బాట పట్టారు.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ రోజు నంద్యాలలో పర్యటించాల్సి ఉంది పురంధేశ్వరి.. బీజేపీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యతానికి బైరెడ్డి శబరి, ఆళ్లగడ్డ ఇంఛార్జ్‌గా ఉన్న భూమా కిషోర్ రెడ్డి.. పార్టీకి రాజీనామాలు చేసి కాకరేపారు.. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి నంద్యాలకు వెళ్దాం అనుకున్నారు.. కానీ, చివరి నిమిషంలో ఆమె పర్యటన రద్దు చేసుకున్నారు.. ఇక, ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు..
Read Also: Underwater Metro: దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో.. నేడు ప్రారంభించనున్న ప్రధాని
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్‌లో BLA-TTP వరస దాడులు..
ఏపీలో ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఖరారుపై బీజేపీ హైకమాండ్‌తో చర్చించేందుకు పురంధేశ్వరి హస్తినకు వెళ్లినట్టు బీజేపీ ఏపీ శ్రేణులు చెబుతున్నాయి.. ఇటీవలే జిల్లాల్లోని ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ.. పార్టీ బలాబలాలపై వరుస సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పార్టీ పరిస్థితి.. ఏయే స్థానాల్లో పోటీ చేయగలమనే అంశంపై అధిష్టానానికి నివేదిక సమర్పించారు జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్. ఇక, బీజేపీ విడుదల చేసే రెండో విడత ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ స్థానాలూ ఉంటాయని రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. వీటి కోసం పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్లినట్టు చెబుతున్నారు. కాగా, టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు వ్యవహారం కూడా తేలాల్సిఉన్న విషయం విదితమే. త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్తారనే ప్రచారం కూడా సాగుతోంది.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!