Site icon NTV Telugu

Purandeswari Delhi Tour: చివరి నిమిషంలో నంద్యాల పర్యటన రద్దు.. ఢిల్లీకి పురంధేశ్వరి

Purandeswari

Purandeswari

Purandeswari Delhi Tour: ఆంధ్రప్రదేశ్‌ పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతూనే ఉంది.. ఈ తరుణంలో చివరి నిమిషంలో నంద్యాల పర్యటన రద్దు చేసుకున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. ఢిల్లీ బాట పట్టారు.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ రోజు నంద్యాలలో పర్యటించాల్సి ఉంది పురంధేశ్వరి.. బీజేపీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యతానికి బైరెడ్డి శబరి, ఆళ్లగడ్డ ఇంఛార్జ్‌గా ఉన్న భూమా కిషోర్ రెడ్డి.. పార్టీకి రాజీనామాలు చేసి కాకరేపారు.. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి నంద్యాలకు వెళ్దాం అనుకున్నారు.. కానీ, చివరి నిమిషంలో ఆమె పర్యటన రద్దు చేసుకున్నారు.. ఇక, ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు..

Read Also: Underwater Metro: దేశంలోనే మొట్టమొదటి అండర్‌ వాటర్ మెట్రో.. నేడు ప్రారంభించనున్న ప్రధాని

ఏపీలో ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఖరారుపై బీజేపీ హైకమాండ్‌తో చర్చించేందుకు పురంధేశ్వరి హస్తినకు వెళ్లినట్టు బీజేపీ ఏపీ శ్రేణులు చెబుతున్నాయి.. ఇటీవలే జిల్లాల్లోని ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ.. పార్టీ బలాబలాలపై వరుస సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పార్టీ పరిస్థితి.. ఏయే స్థానాల్లో పోటీ చేయగలమనే అంశంపై అధిష్టానానికి నివేదిక సమర్పించారు జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్. ఇక, బీజేపీ విడుదల చేసే రెండో విడత ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ స్థానాలూ ఉంటాయని రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. వీటి కోసం పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్లినట్టు చెబుతున్నారు. కాగా, టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు వ్యవహారం కూడా తేలాల్సిఉన్న విషయం విదితమే. త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్తారనే ప్రచారం కూడా సాగుతోంది.

Exit mobile version