Site icon NTV Telugu

Prabhas Spirit: స్పిరిట్‌లో దగ్గుబాటి హీరో?.. అస్సలు ఊహించలేరు!

Sam (3)

Sam (3)

టాలీవుడ్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లలో ‘స్పిరిట్’ మోస్ట్ అవైటేడ్‌ మూవీగా రాబోతోంది. రెబల్ స్టార్ ప్రభాస్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎలా చూపిస్తాడా? అనే ఎగ్జైట్మెంట్ అందరిలోనూ ఉంది. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ పూర్తి చేసుకున్న సందీప్.. తాజాగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇదే నెలలో రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, కాంచన వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

స్పిరిట్ మూవీలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నారు. అలాగే కొరియా నటుడు ‘డాన్‌ లీ’ కూడా ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో దగ్గుబాటి హీరో కూడా నటిస్తున్నట్టుగా తాజాగా నెట్టింట ప్రచారంలోకి వచ్చింది. అసలు ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. ఓ కీల‌క పాత్ర‌ కోసం దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్‌ని ఎంపిక చేసిన‌ట్లుగా సమాచారం. ఆయన పాత్రలో యారోగెన్సీ, చాలా యాటిట్యూడ్ ఉంటుంద‌ని అంటున్నారు.

Also Read: Chelluboina Venugopal: కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోకుండా.. లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లారు!

ఒక‌వేళ ఇదే నిజమైతే.. అభిరామ్‌కి ఇంతకుమించిన బంపర్ ఆఫర్ మరోటి ఉండదనే చెప్పాలి. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అహింస‌’ అనే సినిమాతో అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా ఎప్పుడొచ్చిందో, ఎప్పుడెళ్లిందో కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. ఆ త‌ర్వాత అభిరామ్ మ‌ళ్లీ మ‌రో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ ఇప్పుడు ఏకంగా స్పిరిట్‌లో ఛాన్స్ కొట్టేసినట్టుగా టాక్ నడుస్తోంది. అదే జరిగితే అభిరామ్ కెరీర్‌కు ఇదో టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.

Exit mobile version