D51 Movie : ధనుష్ మూవీకి మారనున్న సంగీత దర్శకుడు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ములా లవ్‌స్టోరీ సినిమా తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని ధనుష్‌తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాను సిద్ధం చేస్తున్నాడు.ఇప్పటికే రిలీజైన టైటిల్ పోస్టర్‌కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. సరికొత్తగా పోస్టర్‌ను డిజైన్ చేసి సినిమా థీమ్ ఎంటో చెప్పేశారు. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు్న్నారు. ప్రస్తుతం చిత్రబృందం ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా ఉంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ముందుగా ఈ సినిమా కోసం ఏ.ఆర్ రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా అనుకున్నారట. కానీ పలు కారణాల వల్ల ఆయనను బదులుగా దేవి శ్రీ ప్రసాద్‌ను రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దేవిశ్రీ తో చర్చలు కూడా జరిపారని సమాచారం.. ఇక దేవి ఈ ఏడాది వచ్చిన వాల్తేరు వీరయ్య తర్వాత ఇప్పటివరకు మరో సినిమా అయితే చేయలేదు.
ప్రస్తుతం ఆయన చేతిలో తెలుగులో పుష్ప సీక్వెల్‌తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ రెండు సినిమాలు ఉన్నాయి. అలాగే తమిళంలో కంగువా, విశాల్34 సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ధనుష్ సినిమా కూడా దేవి మ్యూజిక్ లిస్ట్‌లోకి చేరిపోయింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.ఈ సినిమా ఓ యథార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది. అంతేకాకుండా సమాజంలోని ఆర్థిక అసమానతలను గురించి కూడా చర్చించే విధంగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. అలాగే నాగార్జున కీలకపాత్ర పోషిస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు వున్నాయి. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
Also Read
- INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు