Site icon NTV Telugu

Cyclone Michaung: ఏపీ వైపు దూసుకొస్తున్న మిచాంగ్.. తమిళనాడులో విధ్వంసం

New Project

New Project

Cyclone Michaung: మిచాంగ్ తుఫాను సోమవారం (డిసెంబర్ 4) తీవ్ర తుఫానుగా మారింది. ఇది నెల్లూరుకు ఆగ్నేయంగా 80 కి.మీ, చెన్నైకి ఉత్తర-ఈశాన్య దిశలో 120 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. డిసెంబర్ 5 న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల సమీపంలో నెల్లూరు, మచిలీపట్నం మధ్య మైచాంగ్ తుఫాను తీరాన్ని తాకవచ్చని భారత వాతావరణ శాఖ తెలపింది. మైచాంగ్ తుపాను ప్రస్తుతం బంగాళాఖాతంలో తిరుగుతూ ఆంధ్రా తీరం వైపు కదులుతోంది. తీవ్ర వాయుగుండం పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్‌, నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరాల వైపు వెళ్లినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ కాలంలో దాని వేగం గంటకు 12 కి.మీ.

దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో కుండపోత వర్షం కురిసింది. ఈ సమయంలో, చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, నాగపట్నం, తిరువళ్లూరు మరియు కడలూరు జిల్లాలతో సహా ఉత్తర కోస్తా తమిళనాడులో భారీ వర్షాలు నమోదయ్యాయి. చెన్నై పోలీసులు ఇప్పటివరకు వర్షం సంబంధిత సంఘటనలలో ఐదుగురు మరణించినట్లు తెలిపారు. చెన్నైలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇక్కడ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది.

Read Also:Akkineni Nagarjuna: నాగ్ సరసన ఆమె.. మరీ చిన్న పిల్లలా ఉందే.. ?

బలమైన గాలుల కారణంగా పలు చోట్ల చెట్లు నేలకూలిపోయాయి. భారీ వర్షాల కారణంగా వ్యాసర్పాడి-బేసిన్ బ్రిడ్జి మధ్య 14వ నెంబరు బ్రిడ్జిపై నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో చెన్నై సెంట్రల్ నుంచి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్లను సోమవారం రద్దు చేశారు. దీంతో పాటు చెన్నై విమానాశ్రయాన్ని కూడా మంగళవారం ఉదయం 9 గంటల వరకు మూసివేశారు. రాష్ట్రంలో ప్రతికూల వాతావరణం కారణంగా చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టులో అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, బోర్డులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మూతపడ్డాయి. వర్షం కారణంగా తమిళనాడులోని పల్లికరణైలో వరదలు పోటెత్తాయి. ఇక్కడ నీటి ప్రవాహం చాలా బలంగా ఉండటంతో అనేక కార్లు రోడ్లపై కొట్టుకుపోయాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని 8 జిల్లాల్లో అలర్ట్
భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎనిమిది జిల్లాల అధికారులకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీ కపిలతీర్థం జలపాతంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులను తాత్కాలికంగా నిలిపివేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. స్థానిక ప్రజల భద్రత, సహాయక చర్యల కోసం బాపట్ల కలెక్టరేట్ సమగ్ర చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ సిఎంఒ చెప్పారు. తుపాను దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. అంతేకాకుండా, 24 గంటల సమన్వయం, పరిస్థితిని పర్యవేక్షించడానికి కంట్రోల్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ‘యువ గళం’ పాదయాత్రను మూడు రోజుల పాటు వాయిదా వేశారు. డిసెంబర్ 4, 5 తేదీలలో ఉత్తర-కోస్తా తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. అలాగే డిసెంబర్ 4, 5 తేదీల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Read Also:Off The Record: తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిస్తే.. ఏపీలో ఉలికిపాటు..! కౌంటర్స్‌, రివర్స్‌ కౌంటర్స్‌ సంగతేంటి.?

Exit mobile version