Site icon NTV Telugu

Weather Updates : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Hyderabadrain

Hyderabadrain

Weather Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇవాళ (మే 29) ఉత్తర ఆంధ్ర తీరం దాటి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. రానున్న మూడు రోజుల పాటు వరుసగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. వాతావరణ శాఖ వివరాల ప్రకారం, ఈ వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ వేగం 60 కిలోమీటర్లకు కూడా చేరవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి.

Elon Musk: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ సలహాదారుడిగా వైదొలిగగిన ఎలన్ మస్క్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు సముద్రం మారుమూలంగా ఉండే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటవీ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ విభాగం సూచించింది. ప్రభావిత జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. విద్యుత్‌, రవాణా వ్యవస్థలపై ప్రభావం ఉండే అవకాశం నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.

Elon Musk: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ సలహాదారుడిగా వైదొలిగగిన ఎలన్ మస్క్..!

Exit mobile version