NTV Telugu Site icon

Cyclone Fengal: తుఫాను బీభత్సం.. ఇళ్లపై విరిగి పడిన కొండచరియలు

Fengal Cyclone

Fengal Cyclone

ఫెంగల్ తుఫాను తమిళనాడులో పెను విధ్వంసం సృష్టించింది. తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తిరువణ్ణామలై, విల్లుపురం, పుదుచ్చేరి వరదలతో అతలాకుతలమయ్యాయి. తిరువణ్ణామలైలో పలు ఇళ్ళుపై కొండ చరియలు విరిగి పడ్డాయి. 25 మంది పెద్దవారు, ఐదుగురు పిల్లలు వరకు కొండచరియలు కింద ఇరుక్కు పోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తిరువణ్ణామలై, విలుపురం, కళ్లకురిచ్చిలో రెడ్ అలెర్ట్, తమిళనాడులో ఐదు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. ఈ మూడు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. తిరుచ్చి విల్లుపురం హైవేపై వరద నీరు భారీగా చేరింది. పుదుచ్చేరిలోని కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. దీంతో అధికారులు వరద సహాయక చర్యలు వేగవంతం చేశారు.

READ MORE: Maharashtra Next CM: మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు?.. నేడు అధికారిక ప్రకటన..

కాగా.. తుఫాను ఫెంగాల్ ఆదివారం బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలహీనపడుతుందని అంచనా. ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరిలో దాదాపు స్థిరంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయం1130 గంటలకు పుదుచ్చేరి అక్షాంశానికి సమీపంలో కడలూర్‌కు ఉత్తరాన 30 కిమీ, విల్లుపురానికి తూర్పున 40 కిమీ, చెన్నైకి నైరుతి దిశలో 120 కిమీ దూరంలో ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది చాలా నెమ్మదిగా పశ్చిమ దిశగా కదులుతున్నట్లు సమాచారం.

READ MORE: Mokshagna Teja : నందమూరి మోక్షజ్ఞ రెండవ సినిమా ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే..?