నందమూరి బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ లాంఛ్ అవుతున్నాడు. సెప్టెంబరులో మోక్షజ్ఞ పుట్టిన రోజు కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. భారతీయ పురాణ ఇతిహాసాల నేపథ్యంలో సినిమా ఉండనుందని టాలీవుడ్ టాక్. SLV బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి అలాగే నందమూరి తేజస్విని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ డిసెంబరు 5న జరగనున్నాయి.
ఇక నందమూరి అభిమానులకు మరో గుడ్ న్యూస్ వినిపిస్తుంది. మొదటి సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవకముందే నందమూరి మోక్షజ్ఞ రెండవ సినిమా కు సంబందించిన అప్ డేట్ తెలుస్తోంది. ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదలైన లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో మోక్షు సెకండ్ సినిమాను ఫిక్స్ అయిందట. ఇందుకు తగ్గ కథ,కథనాల చర్చలు కూడా ముగిశాయట. ఈ సినిమాను ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాను అధికారకంగా ప్రకటిస్తారట. ప్రస్తుతం ఇదే బ్యానర్ లో నందమూరి బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ చేస్తున్న సంగతి విదితమే. వచ్చే ఏడాదిసంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.