NTV Telugu Site icon

Cyber Crimes: అమెరికాలో వీట్స్ బిజినెస్ పేరుతో సైబర్ మోసం

Cyber Crime

Cyber Crime

Cyber Crimes: అమెరికాలో వీట్స్ బిజినెస్ పేరుతో సైబర్ మోసం జరిగింది. అధిక లాభాలు వస్తాయని నమ్మించి నేరగాళ్లు 2.1 కోట్లను కాజేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడిని సైబర్ కేటుగాళ్ళు భారీగా మోసం చేశారు. అమెరికాలో చిరుధాన్యాలు ( వీట్స్ ) కంపెనీలో వ్యాపారం చేస్తూ అధిక లాభాలు వస్తాయని నమ్మించి విడతల వారిగా ఆన్‌లైన్‌ ద్వారా 2.1 కోట్ల రూపాయలను కాజేశారు. అనంతరం వారు స్పందించకపోవడం, వారు చెప్పిన కంపెనీ ఫెక్ అని తేలడంతో మోసపోయానని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Read Also: AP and Telangana Rains LIVE UPDATES: వరుణుడి ప్రతాపం.. రేపు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

మరో కేసులో.. విదేశాలకు డ్రగ్స్ పార్సెల్ చేస్తున్నారంటూ అమాయకులను భయపెట్టి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఫెడెక్స్ కొరియర్ ద్వారా విదేశాలకు డ్రగ్స్ పార్సెల్ చేస్తున్నారంటూ మోసాలకు తెగబడుతున్నారు. మనీలాండరింగ్ కేసులు నమోదయ్యాయని, సీబీఐ అధికారుల పేరుతో కేసులు నమోదు అయ్యాయని బెదిరింపులకు పాల్పడుతున్నారు. గత నాలుగు రోజుల్లో నలుగురు వ్యక్తుల నుంచి రూ. 2.93 కోట్లను సైబర్‌ కేటుగాళ్లు కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి కాల్స్, బెదిరింపులు వచ్చినప్పుడు తమను సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Show comments