NTV Telugu Site icon

Cyber Criminals: మైనర్ బాలికలను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు

Cyber Criminals

Cyber Criminals

Cyber Criminals Targets Minor Girls: సైబర్‌ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక రూపంలో అమాయకులను అందినకాడికి దోచుకున్న నేరగాళ్లు.. తాజాగా మైనర్‌ బాలికలను లక్ష్యంగా చేసుకున్నారు. విశాఖలో సైబర్ నేరగాళ్లు మైనర్ బాలికలను టార్గెట్ చేశారు. ఆరుగురు కేంద్రీయ విద్యాలయం విద్యార్థినుల అదృశ్యం కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించి బాలికలను సురక్షితంగా రక్షించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సైబర్ నేరగాళ్లు మైనర్ బాలికలకు న్యూడ్ ఫోటోలని పంపి బెదిరించారు. దీంతో బాలికలు ఎవరికి చెప్పుకోలేక భయపడి హైదరాబాద్‌కి వెళ్లిపోవాలనుకున్నారు. కాగా, విశాఖ నుండి హైదరాబాద్‌కి వెళ్తున్న బస్సులో పోలీసులు బాలికలను గుర్తించారు. బాలికలను సీడబ్ల్యూ ముందుకు తీసుకెళ్లారు ఎయిర్‌పోర్టు పోలీసులు.

Read Also: KP Nagarjuna Reddy: ఆంధ్రాకు జగనే ఎందుకు కావాలంటే.. పథకాలను వివరించిన ఎమ్మెల్యే