NTV Telugu Site icon

Cyber Crime: తస్మాత్‌ జాగ్రత్త.. ఎన్నికల సమాచారం అని లింక్‌ పంపిస్తారు.. క్లిక్‌ చేశారో!

Cyber Crime

Cyber Crime

Cyber Crime: డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ ఎంతగా జనాలకు మేలు చేస్తుందో అంతే కీడు చేస్తుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రాచుర్యం పొందాక ఆన్‌లైన్‌ మోసాలు విపరీతంగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సాంకేతికత అభివృద్ధి చేసుకుంటూ, మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. రోజుకు వేలల్లో ఆన్‌లైన్ మోసాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల సైబర్‌ నేరగాళ్లు ఎన్నో రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు సైబర్ క్రిమినల్స్. తాజాగా ఎన్నికల సమాచారం అంటూ లింక్‌ పంపించి కూడా అకౌంట్ల నుంచి డబ్బు కాజేస్తున్నారు. అలాంటి ఘటన తాజాగా కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది. ఆదోనిలో ఓ వ్యాపారి నుంచి రూ.30 వేలు కాజేశారు సైబర్ చీటర్స్. మొబైల్‌ వ్యాపారి రవి అకౌంట్‌ నుంచి రూ.30 వేలు కొల్లగొట్టారు.

Read Also: Warangal – Ice Cream: వరంగల్ లో దారుణం.. ఐస్ క్రీమ్ లో వీర్యం..!

ఎన్నికల సమాచారం కోసం ఫోన్‌లో క్లిక్ చేయండి.. అన్న దానిపై రవి క్లిక్ చేయడంతో అకౌంట్‌లో ఉన్న డబ్బులు దోచేశారు. ఓటిపీ నెంబర్ ఎవ్వరికీ పంపకుండానే బ్యాంకు ఖాతాలో నగదు మాయం అయింది. దీంతో బాధితుడు రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నికల సమాచారం అని వచ్చినా కాస్త ఆచితూచి వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల పోలీసుల విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. ఎంతో ఈజీగా సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు. వాళ్లు చెప్పింది గుడ్డిగా నమ్మేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎవరికైనా ఎలాంటి అనుమానం కలిగినా వెంటనే తమ దృష్టికి తీసుకురాలని పోలీసులు చెబుతున్నారు. సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.