CWC Recruitment 2025: సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CWC) 179 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మేనేజ్‌మెంట్ ట్రైనీ, అకౌంటెంట్, సూపరింటెండెంట్‌తో సహా వివిధ పోస్టులకు నియమిస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియకు జనవరి 12, 2025 చివరి తేదీ. ఒకవేళ మీలో ఎవరైనా ఇంకా అర్హులయ్యి నమోదు చేసుకోకుంటే, అధికారిక వెబ్‌సైట్ cewacor.nic.inకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. చివరి తేదీ నేడే కాబట్టి వీలైనంత త్వరగా మీరే నమోదు చేసుకోండి. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: New Liquor Brands: కొత్త మద్యం బ్రాండ్లపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..
1. మేనేజ్‌మెంట్ ట్రైనీ (జనరల్) – 40 పోస్టులు
2. మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) – 13 పోస్టులు
3. అకౌంటెంట్ – 9 పోస్టులు
4. సూపరింటెండెంట్ (జనరల్) – 22 పోస్టులు
5. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 81 పోస్టులు
6. సూపరింటెండెంట్ (జనరల్) – SRD (NE) – 2 పోస్టులు
7. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- SRD (NE)- 10 పోస్టులు
8. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-SRD (UT లడఖ్) – 2 పోస్టులు
Also Read: Sabarimala Darshan: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. పంబ వరకు క్యూ లైన్లు
ఇక అభ్యర్థులు వారు దరఖాస్తు చేస్తున్న పోస్ట్ కోసం సంబంధిత రంగంలో డిగ్రీని కలిగి ఉండాలి. అన్ని పోస్టులకు, పోస్టుల ప్రకారం గరిష్ట వయోపరిమితి 28 నుండి 30 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్‌ను క్షుణంగా చదవండి. జనరల్, EWS, OBC కేటగిరీ అభ్యర్థులు రూ. 1350 చెల్లించాలి. అలాగే SC, ST, PwBD, Ex-Serviceman ఇంకా మహిళా అభ్యర్థులు దరఖాస్తు కోసం రూ. 500 చెల్లించాలి.
ఇక అభ్యర్థులను వ్రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రిక్రూట్‌మెంట్ కోసం https://ibpsonline.ibps.in/cwcvpnov24/ ఈ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.
భవిష్యత్ ఉపయోగం కోసం దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసి దాని ప్రింట్ అవుట్ తీసుకోండి.