వంటల్లో కరివేపాకును పక్కన పెట్టినా కూడా పోపులో కరివేపాకు లేంది ఆ రుచి రాదు.. కరివేపాకులో చాలా పోషక విలువలు ఉన్న చాలా వరకు వాటిని తిన్నారు.. వాటి పోషక విలువలు తెలిసాక ఈ మధ్య కాలంలో బాగా తింటున్నారు. ఈ కరివేపాకు కూరలో తాలింపులోనే కాకుండా, వాటితో పుడులు కూడా తయారు చేస్తున్నారు. కరివేపాకుకు ప్రతి కాలంలో డిమాండ్ ఉంటుంది. కరివేపాకుకు ఉన్న డిమాండ్, పోషక విలువలు చూసి కొందరు రైతులు వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో వీటిని ఎక్కువగా పండిస్తున్నారు.. అక్కడ నుంచి ప్రముఖ నగరాలకు మార్కెటింగ్ చేస్తున్నారు..
ఈ కరివేపాకును ప్రతి నాలుగు నెలలకి ఒక్కసారి కోసుకోవచ్చు. రెండు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న ఈ పంట మూడు అడుగుల ఎత్తులో ఉంది. మొక్కల మధ్య దూరం 50-90 సెంటీమీటర్లు ఉండాలి. ఈ కరివేపాకుకు రసాయన ఎరువులు, పురుగుల మందులు అవసరం ఉండదు. ప్రతి రోజు ఈ మొక్కలకి నీళ్లు ఇస్తే చాలు.. ఆకులు బాగా ఉంటాయి.. పొడవుగా ఉంటాయి.. కరివేపాకు సాగుకు డీడబ్ల్యూడీ-1, 2 రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ రెండు రకాలూ మంచి సువాసన కలిగి ఉంటాయి.. కరివేపాకు ఒక ఎకరంలో సాగు చేస్తే 30 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ మొక్కలు 4అడుగుల పొడవు పెరిగి నప్పుడు కోతలు కోయాలి. కర్వేపాకుకు మార్కెట్లో ఒక టన్నుకు 20-30 వేల రూపాయలకి రైతులు అమ్ముకుంటున్నారు. వీటిని సాగు చేస్తూ రైతులు మంచి లాభాలని పొందుతున్నారు. ఈ కరివేపాకును వ్యాపారులు విదేశాలకి ఎగుమతి చేస్తూ కూడా మంచి లాభాలు పొందుతున్నారు.. కరివేపాకును ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడటంలో వీటికి మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది..
రైతులు కొద్దిపాటి శ్రమ, మేలైన యాజమాన్య పద్ధతులతో కొన్ని రకాల వాణిజ్య పంటల్ని సాగు చేస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇలాంటి పంటల్లో కరివేపాకు ఒకటి. ఈ పంట నమ్మకమైన దిగుబడుల్ని, ఆదాయాన్ని అందిస్తుంది. కరివేపాకు తోటలో పప్పుధాన్యాలు, ఆకుకూరల్ని అంతరపంటలుగా సాగు చేసి అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. కరివేపాకును నీటి పారుదల కింద, నీరు లేనప్పుడు మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా సాగు చేయవచ్చు.. ఈ పంట అధిక నీటిని తట్టుకోలేదు..
ఇకపోతే విత్తనాలు విత్తిన 9-10 నెలలకు పంట కోతకు వస్తుంది. అయితే మొదటి కోతలో కరివేపాకు దిగుబడి, ఆదాయం చాలా తక్కువగా ఉంటాయి. ఎకరానికి 800 నుంచి వెయ్యి కిలోల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రతి మూడు నాలుగు నెలలకు ఒక కోత తీసుకోవచ్చు. రెండో సంవత్సరంలో ఎకరానికి రెండు వేల నుంచి మూడు వేల కిలోల దిగుబడి వస్తుంది. అనంతరం ప్రతి కోతకు దిగుబడి పెరుగుతూ ఉంటుంది.. ఈ పంటకు సంబందించి మరింత సమాచారం కోసం వ్యవసాయ నిపుణులను సంప్రదించాలి..