NTV Telugu Site icon

IPL 2024: అభిమానులకు శుభవార్త.. భారత్ చేరుకున్న విరాట్ కోహ్లీ! ‘కింగ్’ వీడియో వైరల్

Virat Kohli Reach India

Virat Kohli Reach India

Virat Kohli Lands in India for IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో 6 రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సన్నద్ధం అవుతున్నాయి. ఈ సమయంలో ఆర్‌సీబీ అభిమానులకు ఓ శుభవార్త. లండన్ నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీ భారత్ చేరుకున్నాడు.

ఆదివారం ఉదయం విరాట్ కోహ్లీ లండన్ నుంచి భారత్‌కు వచ్చాడు. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చిన కోహ్లీ.. కారు ఎక్కి వెళ్లిపోయాడు. విరాట్ బ్లాక్ కలర్ టీషర్ట్, వైట్ కలర్ పాయింట్ వేసుకున్నాడు. ఇందుకుసంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన ఆర్‌సీబీ ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. కింగ్ వచ్చేశాడు అని కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Iceland Volcano: ఐస్‌లాండ్‌లో బద్దలైన అగ్నిపర్వతం.. మూడు నెలల్లో నాలుగోసారి!

తన సతీమణి అనుష్క శర్మ ప్రసవ సమయంలో ఆమె పక్కన ఉండేందుకు విరాట్‌ కోహ్లీ ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నుంచి తప్పకున్న విషయం తెలిసిందే. 2024 ఫిబ్రవరి 15న లండన్‌లోని ఓ ఆసుపత్రిలో అనుష్క పండంటి మగబిడ్డకు జన్మినిచ్చారు. తమ కుమారుడికి ‘అకాయ్‌’ అని నామకరణం చేసినట్లు విరాట్ తెలిపాడు. దాదాపు నెల రోజులుగా కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2024 కోసం ఈరోజు భారత్ వచ్చాడు. నేడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులో అతడు చేరనున్నాడు. మార్చి 19న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోని ఆర్‌సీబీ జెర్సీ రీవీల్‌ కార్యక్రమంలో విరాట్ పాల్గొననున్నాడని తెలుస్తోంది.