MS Dhoni Comeback: చెన్నై ఊపిరి పీల్చుకో.. ధోని తోపాటు ఆ స్టార్ ప్లేయర్ ఈజ్ బ్యాక్..!
- Chennai Super Kings కు కీలక గుడ్ న్యూస్
- Dewald Brevis ఢిల్లీ మ్యాచ్‌కు తిరిగి వచ్చే అవకాశం
- MS Dhoni ఇంకా రిహాబ్లోనే
- ఏప్రిల్ 14న KKR మ్యాచ్‌లో రిటర్న్ అయ్యే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni and Dewald Brevis Comeback in IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన ఓ కీలక అప్డేట్ బయటకు వచ్చింది. IPL 2026లో ఆశించిన విధంగా ప్రారంభం కాని CSKకు ఇప్పుడు ఊరటనిచ్చే విషయం అందింది. ఈ సీజన్లో చెన్నై జట్టు ప్రదర్శన నిరాశజనకంగా ఉంది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)పై వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయి, నెట్ రన్‌రేట్ -2.517తో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. చెన్నై నెక్స్ట్ మ్యాచ్ ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిటల్స్ తో చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జరగనుంది.
Also Read
ఇకపోతే దక్షిణాఫ్రికా యువ బ్యాట్స్‌మన్ దేవాల్డ్ బ్రెవిస్ శిక్షణ సమయంలో సైడ్ స్ట్రెయిన్ గాయంతో మొదటి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అతను తిరిగి ప్లేయింగ్ XIలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో CSK బ్యాటింగ్ లైనప్ మరింత పెరగనున్నాయి. ఇక MS ధోని విషయానికి వస్తే.. ఆయన ఫిట్నెస్ ఇంకా పూర్తిగా సెట్ కాలేదని సమాచారం. కాల్ఫ్ మజిల్ గాయంతో IPL 2026 ప్రారంభ మ్యాచ్‌లకు దూరమైన ధోనీ ప్రస్తుతం రిహాబ్‌లో ఉన్నారు. ఇటీవల ఫిట్నెస్ టెస్ట్ కూడా చేశారు. కానీ అతని రిటర్న్ విషయంలో జట్టు తొందరపడకుండా మరోసారి టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ అన్ని అనుకూలంగా ఉంటే ఏప్రిల్ 14న కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో ధోనీ మైదానంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అప్డేట్తో ‘యెల్లో ఆర్మీ’ అభిమానుల్లో మళ్లీ ఆశలు పెరిగాయి.
ఇక దేవాల్డ్ బ్రెవిస్ గత IPL సీజన్ లో CSK తరఫున 6 మ్యాచ్‌లు ఆడి 225 పరుగులు చేశాడు. అతని సగటు 37.50 కాగా, స్ట్రైక్‌రేట్ 180.00గా ఉంది. అలాగే ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్ 2026లో దక్షిణాఫ్రికా తరఫున 7 ఇన్నింగ్స్‌లలో 207 పరుగులు చేసాడు. బ్రేవిస్ జట్టులోకి వస్తే మిడిల్ ఆర్డర్‌కు బలం చేకూరుతుంది. అతను నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉండగా, కార్తిక్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
-
Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్‌లు.. నెట్టింట తీవ్ర వివాదం
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!