రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో మరోసారి సమావేశం నిర్వహించనుంది. సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, హెల్త్ కార్డులు, 11వ పీఆర్సీ పెండింగ్ వంటి తదితర అంశాల గురించి చర్చలు జరుపనున్నారు. సీఎస్ కె.ఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి.. ఆర్ధిక శాఖ, సాధారణ పరిపాలన, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఉద్యోగ సంఘాల నుంచి నేతలు బొప్పరాజు, బండి, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి తదితరులు హాజరై మరోమారు తమ డిమాండ్ల గురించి ప్రస్తావించనున్నారు. అయితే.. ఉద్యోగుల హెల్త్ స్కీం పై సమావేశం కానున్న స్టీరింగ్ కమిటీ.. సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్ లో సమావేశం జరుగనుంది.
ఇదిలా ఉంటే.. ఇటీవల రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కీలక సమావేశం జరిగింది.. రాష్ట్ర సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామిరెడ్డి, ఇతర నేతలు.. సీఎం దగ్గర సమీక్షలో ఉన్నందున సమావేశానికి సీఎస్ జవహర్ రెడ్డి హాజరుకాలేకపోయారు.. ఇక, సమావేశ అనంతరం మీడియాతో మాట్లాడిన ఉద్యోగ సంఘాల నేతలు.. చర్చల సారాశాంన్ని వివరించారు.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ నియామకానికి సంబంధించి సిక్స్ పాయింట్ ఫార్ములాతో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జోనల్ వ్యవస్థ ద్వారా నియామకాలు జరుగుతున్నాయి అని తెలిపారు ఏపీ సెక్రెటరియేట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వెంకటరామిరెడ్డి.. రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా 26 జిల్లాల ఏర్పాటు జరిగింది. జిల్లాల సంఖ్య పెరగడం వలన జోనల్ వ్యవస్థ పై రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేయాల్సి ఉందన్న ఆయన.. జోనల్ వ్యవస్థ పై ఎలా చేస్తే బాగంటుందనే దానిపై మా అభిప్రాయం అడిగారు.. ఇప్పుడు ఉన్న నాలుగు జోన్లు కొనసాగించాలా..? లేదా ఆరు జోన్లకు పెంచాలా…? అనే దానిపై చర్చ జరిగిందని.. తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఏ జోన్ లో కలపాలనేది సమస్యగా ఉందన్నారు. లోకల్ స్టేటస్ పై గతంలో 10వ తరగతి లోపు 7 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ లోకల్ స్టేటస్ ఉండేది.. దానిని 7th వరకు తగ్గించాలనే దానిపై చర్చ జరిగిందని వెల్లడించారు.