ప్రస్తుత ప్రపంచంలో మనిషి జీవితం ఎన్నో రకాల ఎమోషన్స్ తో ముడిపడి ఉంది. నవ్వు, ఏడుపు, టెన్షన్ లాంటి కామన్ థింగ్స్ మన జీవితంలో సహజంగా మారిపోయాయి. సంతోషం వచ్చినప్పుడు మనుషుల జీవితంలో ఆనందంగా నవ్వడం చేస్తుంటే., అలాగే దుఃఖం వచ్చినప్పుడు కూడా మనుషులు బాధపడుతూ ఒంటరిగా గడిపేస్తారు. అయితే అలాంటి సమయంలో కళ్ళల్లో నీరు రావడం సహజమే. కాకపోతే చాలామంది ఏడవాలని అనుకున్న వేరే వారు తమను ఏమనుకుంటారో అని వారు ఏడవకుండా వారిలో వారే కుంగిపోతారు. కాకపోతే ఇప్పుడు అలాంటి వారి కోసం ప్రత్యేకమైన రూమ్స్ తీసుకోవచ్చారు.
Also Read: RCB vs CSK: ఆర్సీబీకి ‘చెపాక్’ కష్టాలు.. మరి ఈసారి ఎలాగో..?
ముఖ్యంగా ఏడ్చాలి అనుకునే వారి కోసం ప్రత్యేకంగా వారికోసం రూమ్స్ ఏర్పాటు చేసేసారు. ప్రజలు ఇక్కడికి వచ్చి వారి దుఃఖానికి సంబంధించి కన్నీళ్లు పెట్టుకొని బాధను తీర్చుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పార్లర్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మొదలైంది. ఈ పార్లర్ పేరు ‘సోబ్ పార్లర్’. ఈ పార్లల్ లో ఓ ప్రైవేట్ క్రై రూమ్ ను తయారు చేశారు నిర్వాహకులు. ఇక్కడ ఎవరైతే బాధలో ఉన్నారో వారు ఎంత సమయం కావాలంటే అంత సమయం ఏడవటానికి సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. ఇలా ఏడవడం ద్వారా వారి మనసు తేలిక పడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక పార్లల్ ను ఆంథోనీ విలోట్టి అనే వ్యక్తి మొదలు పెట్టాడు.
Also Read: Cash and Liquor Seized: ఎన్నికల నేపథ్యంలో విస్తృతంగా తనిఖీలు.. భారీగా నగదు, మద్యం పట్టివేత
ఈయన ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలో చాలామంది ఒత్తిడి సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పుకొచ్చారు. కొందరు ఆఫీసులో పడే ఒత్తిడి కారణంగా, మరికొందరు ఇంట్లో సమస్యల వల్ల వచ్చే ఒత్తిడి కారణంగా ఏడవాలని భావిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరొకరు మన గురించి ఏమనుకుంటున్నారో అని ఏడవడం మానేస్తున్నారు. కాబట్టి మనసు తీరా ఏడవడం ద్వారా ఒత్తిని తగ్గించడంలో సాయపడుతుందని శాస్త్రవేత్తలు కూడా తెలిపారు. కాబట్టి అలాంటి వారి కోసం ఈ క్రయింగ్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.