Shivraj Chouhan: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ దేశంలో ఎవరూ వినడం లేదని విదేశాల్లో మాట్లాడుతున్నారని… అక్కడ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారని శివరాజ్ సింగ్ చౌహాన్ ఎద్దేవా చేశారు. ఇలా ఏడ్వడం వల్ల కాంగ్రెస్ నాయకత్వంపై జాలేస్తోందని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్‌నాథ్ అనే అబద్ధాలు ప్రచారం చేశారని, ఆయన తమ వాగ్దానాలను నెరవేర్చలేదని.. వాటిని నెరవేర్చకుండాని మరోసారి కొత్త వాగ్దానాలను ప్రచారం చేస్తున్నారన్నారు. అప్పటి హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
మధ్యప్రదేశ్ బడ్జెట్‌లో మహిళల కోసం మొత్తం 40 శాతం బడ్జెట్‌ను అందిస్తామని కమల్‌నాథ్ వాగ్దానం చేశారని, చేశారా అంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశ్నించారు. వాగ్దానాలు చేశారు తప్ప ప్రజల కోసం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. హోలీ వల్ల తాము అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎటువంటి కార్యక్రమం చేయలేదు కానీ సోదరీమణుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలను తీసుకున్నామని శివరాజ్ సింగ్ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలు తమ పిల్లలను చూసుకోవాలని కాబట్టి వారికి ఏడు రోజుల సాధారణ సెలవులు అదనంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మహిళా ఉద్యోగులందరూ వారి అవసరానికి అనుగుణంగా ఉపయోగించవచ్చన్నారు.
Read Also: Covid19 : కరోనా బాధితుల్లో గుండె సంబంధిత మరణాల ప్రమాదం 5 రెట్లు ఎక్కువ
అంతే కాకుండా 10వ తరగతి తరువాత బాలికలకు ఆర్థిక అక్షరాస్యత కోసం పాఠాలు నేర్పుతామని తెలిపారు. ఇది మహిళా ఆధారితమైనది. బాలికలకు నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాట్లు చేయబడతాయి, ఇందులో చేనేత, ఎంబ్రాయిడరీ, సాంప్రదాయ జానపద కళలలో శిక్షణ ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర మహిళలకు ఎన్‌ఐడీ, నిఫ్ట్ ఇన్‌స్టిట్యూట్స్ ద్వారా ఆధునిక నమూనాలు, ఆధునిక పద్ధతుల్లో శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. ఐటీఐలో చదువుతున్న అమ్మాయిలకు డిజిటల్, ఆర్థిక అక్షరాస్యత, ఇంగ్లీష్, కమ్యూనికేషన్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ వంటి వాటిలో 60 నుండి 80 గంటల శిక్షణ ఇవ్వబడుతుందన్నారు.