Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Crying Like A Child Abroad Shivraj Chouhan Attacks Rahul Gandhi

Shivraj Chouhan: విదేశాల్లో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు.. రాహుల్‌పై శివరాజ్‌ చౌహాన్‌ వ్యాఖ్యలు

Published Date :March 9, 2023 , 4:52 pm
By Mahesh Jakki
Shivraj Chouhan: విదేశాల్లో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు.. రాహుల్‌పై శివరాజ్‌ చౌహాన్‌ వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Shivraj Chouhan: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ దేశంలో ఎవరూ వినడం లేదని విదేశాల్లో మాట్లాడుతున్నారని… అక్కడ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారని శివరాజ్ సింగ్ చౌహాన్‌ ఎద్దేవా చేశారు. ఇలా ఏడ్వడం వల్ల కాంగ్రెస్ నాయకత్వంపై జాలేస్తోందని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌ కమల్‌నాథ్‌ అనే అబద్ధాలు ప్రచారం చేశారని, ఆయన తమ వాగ్దానాలను నెరవేర్చలేదని.. వాటిని నెరవేర్చకుండాని మరోసారి కొత్త వాగ్దానాలను ప్రచారం చేస్తున్నారన్నారు. అప్పటి హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.

మధ్యప్రదేశ్‌ బడ్జెట్‌లో మహిళల కోసం మొత్తం 40 శాతం బడ్జెట్‌ను అందిస్తామని కమల్‌నాథ్ వాగ్దానం చేశారని, చేశారా అంటూ శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ ప్రశ్నించారు. వాగ్దానాలు చేశారు తప్ప ప్రజల కోసం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. హోలీ వల్ల తాము అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎటువంటి కార్యక్రమం చేయలేదు కానీ సోదరీమణుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలను తీసుకున్నామని శివరాజ్‌ సింగ్ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలు తమ పిల్లలను చూసుకోవాలని కాబట్టి వారికి ఏడు రోజుల సాధారణ సెలవులు అదనంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మహిళా ఉద్యోగులందరూ వారి అవసరానికి అనుగుణంగా ఉపయోగించవచ్చన్నారు.

Read Also: Covid19 : కరోనా బాధితుల్లో గుండె సంబంధిత మరణాల ప్రమాదం 5 రెట్లు ఎక్కువ

అంతే కాకుండా 10వ తరగతి తరువాత బాలికలకు ఆర్థిక అక్షరాస్యత కోసం పాఠాలు నేర్పుతామని తెలిపారు. ఇది మహిళా ఆధారితమైనది. బాలికలకు నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాట్లు చేయబడతాయి, ఇందులో చేనేత, ఎంబ్రాయిడరీ, సాంప్రదాయ జానపద కళలలో శిక్షణ ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర మహిళలకు ఎన్‌ఐడీ, నిఫ్ట్‌ ఇన్‌స్టిట్యూట్స్ ద్వారా ఆధునిక నమూనాలు, ఆధునిక పద్ధతుల్లో శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. ఐటీఐలో చదువుతున్న అమ్మాయిలకు డిజిటల్, ఆర్థిక అక్షరాస్యత, ఇంగ్లీష్, కమ్యూనికేషన్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ వంటి వాటిలో 60 నుండి 80 గంటల శిక్షణ ఇవ్వబడుతుందన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • Madhya Pradesh
  • Madhya Pradesh Chief Minister
  • rahul gandhi

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions