Thug Life : థగ్ లైఫ్ నుంచి క్రేజీ న్యూస్..మూడు పాత్రలలో అలరించనున్న కమల్ హాసన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చివరగా నటించిన ‘విక్రమ్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది.ఆయన కెరీర్ లోని బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ విడుదలైన ప్రతి చోటా బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకుంది.విక్రమ్ సూపర్ హిట్ తర్వాత కమల్, శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’లో నటించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో కలిసి ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘థగ్ లైఫ్’ అనే పేరు పెట్టారు. కమల్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. కమల్ కెరీర్ లో 234వ సినిమాగా ‘థగ్ లైఫ్’ తెరకెక్కుతోంది.
ఈ చిత్రంలో కమల్ హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నట్లు టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ లో వెల్లడించారు. “నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. పుట్టినప్పుడే శక్తివేల్ నాయకర్ నుదిటిపై క్రిమినల్, గూండా, యాకూజా అని రాసినట్టు ఉన్నారు” అంటూ సాగిన గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కమల్ సరికొత్త వేషధారణలో కనిపించి ఆకట్టుకున్నారు. యాక్షన్ సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. టైటిల్స్ గ్లింప్స్ తర్వాత ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ‘థగ్ లైఫ్’ సినిమాలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేనున్నట్లు టాక్ వినిపించింది. రెండు సరికొత్త పాత్రలల్లో కనిపిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ మూవీలో కమల్ పాత్రలకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఇందులో ఆయన మూడు పాత్రలు పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మూడు పాత్రలను లింక్ చేస్తూ మణిరత్నం ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.. ‘థగ్ లైఫ్’ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే చిత్రబృందం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మరియు తమిళ హీరో జయం రవి ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు..
Also Read
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
- Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
- IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్‌కు ఫుల్ స్టాప్..?
తాజావార్తలు
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్‌కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
-
Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..