అభిషేక్ బచ్చన్ : హిరోగా మార్కెట్ డల్‌గా ఉండటంతో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ యాంటోగనిస్టుగా ఛేంజ్ అయ్యాడు. షారూక్ ఖాన్ కింగ్ సినిమాలో విలన్ అవతారమెత్తాడు. హీరోగా అభిషేక్‌కు ఫామ్ లేకపోయినప్పటికీ.. అవకాశాలకు వచ్చిన ఢోకాలేదు. ఇప్పటికీ మెయిన్ లీడ్‌గా ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. కానీ అనవసరంగా ప్రొడ్యూసర్స్‌ను ఇబ్బంది పెట్టడకూడదనుకున్నాడో లేక ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తానన్నారో కింగ్‌లో షారూఖ్‌తో తలపడబోతున్నాడు. అయితే అభిషేక్‌కు విలన్ రోల్ పోషించడం ఇప్పుడేమీ కొత్తకాదు. గతంలో కొన్ని సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు.
పృధ్వీరాజ్ సుకుమారన్ : మాలీవుడ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్‌లో ఒకరు పృధ్వీరాజ్ సుకుమారన్. హీరోగానే కాదు.. దర్శకుడిగా ఫ్రూవ్డ్ పర్సన్. మలయాళంలో ఫుల్ డిమాండ్ ఉన్న హీరో. కానీ తెలుగులో విలన్ అవతారం ఎత్తాడు. మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కుతోన్న వారణాసిలో రణ కుంభ రోల్ చేస్తున్నాడు. సరికొత్త విలనీజాన్ని ప్రదర్శించబోతున్నాడు.
Also Read : The Rajasaab : ఓల్డ్ రాజాసాబ్ వచ్చేసాడు.. థియేటర్లు ఫుల్ చేశాడు
యశ్ : శాండిల్ వుడ్‌ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన హీరో యశ్. కేజీఎఫ్ సిరీస్ చిత్రాల తర్వాత బాలీవుడ్ ఇతడి నెక్ట్స్ సినిమా టాక్సిక్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తుంది. కానీ ఇతడు మాత్రం బాలీవుడ్‌లో విలన్ రోల్ పోషించడానికి వెళ్లిపోయాడు. ఇప్పటి వరకు ఇండియా సినీ చరిత్రలో కనివిని ఎరుగని భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణలో రావణుడిగా మారబోతున్నాడు రాఖీ భాయ్.
విజయ్ సేతుపతి : కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా ఎన్ని సక్సెస్‌లు అందుకున్నా కూడా విలన్ రోల్ చేయమనగానే కాదనకుండా యస్ చెబుతున్నాడు. కాతు వాకు రెండు కథలుతో హిట్ కొట్టిన వెంటనే విక్రమ్, తాజాగా జవాన్‌లో నెగిటివ్ షేడ్స్‌లో కనిపించిన మక్కల్ సెల్వన్.. ఇప్పుడు మహారాజా, తలైవన్ తలైవి లాంటి హిట్స్ పడ్డాక కూడా మళ్లీ విలన్ రోల్స్‌కు షిఫ్ట్ అవుతున్నాడు. హీరోగా చేతిలో త్రీ మూవీస్ ఉన్నా.. వెట్రిమారన్ అడిగారని.. శింబు అరసన్‌లో నెగిటివ్ రోల్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఎప్పుడు హీరోగానే ఏం చేస్తాంలే బోర్ కొట్టేస్తుందనుకుంటున్న డైనమిక్ హీరోస్.. తమలోని వర్సటాలిటీని బయటకు తీసేందుకు యాంటోగనిస్టులుగా మారుతున్నారు.
