హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. బలమైన ఈదురు గాలులతో బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలో ఈదురు గాలులు వణికించాయి. గాలుల ధాటికి అబిడ్స్ లో భవన నిర్మాణంపై నుంచి భారీ క్రేన్ కూలిపోయింది. పక్కన ఉన్న ఆరోగ్య హాస్పిటల్ భవనంపై కూలింది. అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్పిటల్ 4వ అంతస్తుపై పడ్డ క్రేన్.. గతంలోనే భవనం కాలి చేసేసిన ఆరోగ్య హాస్పిటల్ మేనేజ్మెంట్.. 4వ అంతస్తు కాలీగా ఉండడం…