NTV Telugu Site icon

Prakash Karat : కేంద్ర సర్కారు అదానీ, అంబానీల ప్రభుత్వం అయిపోయింది

Prakash Karat

Prakash Karat

గత తొమ్మిదేళ్ళలో మోదీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి దేశాన్ని లూటీ చేసిందని ఆరోపించారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కేంద్ర సర్కారు అదానీ, అంబానీల ప్రభుత్వం అయిపోయిందన్నారు. అదానీ, అంబానీల ప్రభుత్వాన్ని కుల్చాల్సిన అవసరం ఉందని, మోదీ ప్రభుత్వం సహజ వనరులను అదానీ, అంబానిలకు కట్టబెడుతుందన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఏ అంశం చర్చించకుండా వాయిదాలు వేస్తున్నారని, అదానీ అక్రమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని, అదానీ అక్రమ ఆస్తులపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే.. సమాధానం చెప్పకుండా సభను వాయిదా వేస్తున్నారన్నారు. గౌతం అదానీని కాపాడేందుకు మోడీకి ఎందుకు అంత తాపత్రయమని, మోదీ ప్రధాని అయ్యాక అదానీ అస్తి 50వేల కోట్ల నుంచి 10లక్షల కోట్లకు పెరిగిందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బడా పెట్టుబడిదారులు సహజ వనరులను శాసిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పేదలపైన పన్నులు వేస్తున్నారు తప్పితే.. సంపన్నులపై పన్నులు వేయడం లేదని, గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులపైన కోత విధించారన్నారు.

Also Read : IPL 2023 : ప్రతి టీమ్ లో ముగ్గురు కొత్త ప్లేయర్స్..

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మతవిద్వేషాలు రెచ్చ గొడుతున్నారని, హిందుత్వ ముసుగులో అదానీ, అంబానీ కోసం పని చేస్తూ సామాన్య ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. రాజ్యాంగంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి చేస్తోందని, లాల్ ప్రసాద్ యాదవ్, కవిత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిపై ఈడీ, సీబీఐతో దాడులు చేయించిందన్నారు. అంతేకాకుండా.. ‘ప్రతిపక్ష రహిత దేశంగా మార్చాలని మోదీ లక్ష్యమని, బీజేపీ..భారతీయ జనతా వాషింగ్ మెషిన్ గా మారిపోయింది. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మపై అవినీతి కేసు బిజెపి లో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయింది. మోదీ కార్పొరేట్ విధానాలపై ఉదృతమైన పోరాటాలు నిర్వహించాల్సి ఉంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దక్షిణాదిలో తెలంగాణను లక్ష్యంగా చేసుకుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు పన్నుతోంది. వామపక్ష, లౌకిక శక్తులు బిజెపి అధికారంలోకి రాకుండా నిరోధించాలి. బీజేపీ మత చిచ్చు కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

Also Read : Priyanka Chopra: అమెరికా వెళ్లగానే కళ్ళు కనిపించడం లేదా.. ఆర్ఆర్ఆర్ నే అవమానిస్తావా..?