Priyanka Chopra: అమెరికా వెళ్లగానే కళ్ళు కనిపించడం లేదా.. ఆర్ఆర్ఆర్ నే అవమానిస్తావా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నేళ్ల క్రితం తనకన్నా చిన్నవాడైన నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్ళాడి అమెరికా కోడలిగా మారిపోయింది. ప్రస్తుతం అమెరికా కోడలిగా సెటిల్ అయిన ఈ భామ ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా మారింది. ఇక అప్పుడప్పుడు బాలీవుడ్ లో మెరుస్తూ ఉంటుంది. ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ వేడుకల్లో చరణ్, ఉపాసనతో కలిసి కనిపించి ఆశ్చర్యపరిచింది. నిజం చెప్పాలంటే… ప్రియాంక తొలి తెలుగు హీరో చరణ్ మాత్రమే. తుఫాన్ సినిమాలో చరణ్ సరసన ప్రియాంక నటించింది. చరణ్ గురించి, ఆర్ఆర్ఆర్ గురించి ఇంత తెలిసినా.. మీడియా ముందు మాత్రం ఆమె ఆర్ఆర్ఆర్ ను అవమానించింది. ప్రస్తుతం ప్రియాంక చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Dasara: ‘దసరా’ లో సిల్క్ స్మిత పోస్టర్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..?
Also Read
ఇటీవల ఆమె ఒక పబ్లిక్ ప్లాట్ ఫామ్ లో పాల్గొన్న ఆమెకు ఆర్ఆర్ఆర్ గురించిన ప్రస్తావన వచ్చింది. ఆర్ఆర్ఆర్ ఒక బాలీవుడ్ సినిమా అని ప్రముఖ ఆంగ్ల చానెల్ వ్యాఖ్యాత డాక్స్ షెపర్డ్ అనగా.. తప్పు తప్పు..”ఆర్ఆర్ఆర్ ఒక గ్రేట్ తమిళ్ సినిమా.. అది మన అందరికీ అవెంజర్స్ సినిమా లాంటిది.” అంటూ చెప్పుకొచ్చింది. ఆ ఒక్క మాట చాలదు.. అభిమానులు ఆమెను ఏకిపారేయడానికి.. ఆర్ఆర్ఆర్.. తమిళ్ సినిమానా.. కళ్ళు పోయాయా..? లేక అమెరికా వెళ్ళాకా.. కనిపించడం లేదా ..? ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా. అన్నింటికి మించి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ కాదు అది ఒక ఇండియన్ సినిమా.. అది గుర్తుంచుకొని మాట్లాడు అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ అన్నారు.. ఇప్పుడేమో కోలీవుడ్ అంటున్నారు.. మరి ఇంకెప్పుడు ఈ సినిమా తెలుగు సినిమా అంటారు. వారందరు తెలుగువారు అని ఎప్పుడు గుర్తిస్తారు అని ఇంకొందరు వాపోతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. మరి ఈ విషయమై ఆర్ఆర్ఆర్ టీమ్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!