NTV Telugu Site icon

BV Raghavulu: తెలంగాణలో సీపీఐ, సీపీఎం విడిపోలేదు.. బీవీ రాఘవులు కీలక వ్యాఖ్యలు

Bv Raghavulu

Bv Raghavulu

BV Raghavulu: మోదీకి, అమిత్ షా కి తెలీకుండా చంద్రబాబును బొక్కలో వేయలేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. జనసేన నాయకుడు మోడీని పొగడటమే సరిపోయింది బీసీ సభలో అంటూ ఆయన ఎద్దేవా చేశారు. మరల మూడోసారి మోడీ రావాలని పవన్ కళ్యాణ్ కోరారని.. మోడీ రాజకీయాలు నచ్చాయట పవన్ కళ్యాణ్‌కు అంటూ బీవీ రాఘవులు పేర్కొన్నారు. పవన్‌తో కామన్ మేనిఫెస్టో తెస్తున్న టీడీపీ కూడా బీజేపీ చెంతకే చేరుతుందన్నారు. మోడీ కాదా అమరావతి రాకుండా చేస్తోందని ఆయన ప్రశ్నించారు. మోడీ రాజకీయాలు ఏపీకి నష్టం చేస్తాయన్నారు. రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్న మోడీ కాళ్ళు మొక్కే వాడు అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ప్రారంభిస్తాడా అంటూ ఆయన మండిపడ్డారు.

Also Read: Tummala Nageswara Rao : నాకు పదవులు అవసరం లేదు.. జిల్లా అభివృద్ధి కోసమే బరిలో ఉన్నా

సామాజిక సాధికారత యాత్రలు కావు.. సామాజిక సంహార యాత్రలు అవి అంటూ ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. సమాజానికి కావాల్సిన అంశాలు తీసేస్తే మాట్లాడని వాళ్ళు సామాజిక సాధికారత యాత్రలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నలు గుప్పించారు. అమెరికాకి వెళ్ళే వారికి ఇంగ్లీషు చదువులు కావాలి… మాకు అక్కర్లా అంటూ బీవీ రాఘవులు అన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచీ తీసుకున్న అప్పుతో ఇంగ్లీషు చదువులు పెట్టాడు.. ఆ 2వేల కోట్లు మెక్కడానికే అంటూ ఆయన ఆరోపించారు. ఎన్డీఏ చేసిన ద్రోహంతో 20 ఏళ్ళు వెనక్కి పోయామన్నారు. ఏపీలో బీజేపీ ఉనికి లేదని.. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ కాళ్ళకు మొక్కుతోందన్నారు. ఇక్కడ ఎలా మాట్లాడుకున్నా.. టీడీపీ, వైసీపీ కలిసి బీజేపీకి పార్లమెంటులో మద్దతిస్తాయని ఆయన అన్నారు.

తెలంగాణలో సీపీఐ, సీపీఎం విడిపోలేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు చెప్పారు. తెలంగాణలో సీపీఐ పోటీ చేసే ఒక స్ధానంలో మద్దతిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు. సీపీఐ, కాంగ్రెస్ ఒడంబడికతో మేం తెలంగాణలో అంగీకరించలేదన్నారు. సీపీఐకి టీడీపీ మీద ఆశ ఉందన్నారు. కాంగ్రెస్ ఏపీలో పెద్ద శక్తి ఏమీ కాదని.. రఘువీరా, రామకృష్ణ వేదికలకు పెద్ద విలువ ఏం లేదన్నారు. మోడీకి వ్యతిరేకంగా నిలబడే శక్తులు ఏపీలో కనబడటం లేదన్నారు. టిడిపి, వైసీపీ ఎన్డీయే కూటమిలో చేరాలని చూస్తున్నాయన్నారు. రాజకీయ ప్రత్యామ్నాయంగా ఉండేలా మూడు పార్టీలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించామని బీవీ రాఘవులు వెల్లడించారు. ప్రత్యామ్నాయ అభివృద్ధి మార్గం తెలుపుతూ సీపీఎం సభలు జరిగాయన్నారు. టిడిపి, వైసీపీ పాలనల్లో ఏపీ వెనకబడిపోయిందని ఆయన అన్నారు.