V Srinivasa Rao: ప్రమాదంలో యువత..! గంజాయి నిర్మూలనకు స్పెషల్ పార్టీ వేయండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V Srinivasa Rao: గంజాయికి యువత అలవాటుపడుతోంది.. గంజాయి చలామణి చేసే వారికి సపోర్టు ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు స్పెషల్ పార్టీ వేయాలని డిమాండ్ చేశారు. నార్కోటిక్స్ బోర్డు ప్రచారం కోసం ప్రకటనలు చేస్తోంది.. గంజాయి ఉత్పత్తి కేంద్రాల వెనుక పలుకుబడి ఉన్న వ్యక్తులున్నారు అని విమర్శించారు. ఇక, రాష్ట్రంలో కరువు లేదని చెప్పడానికే కరువు ప్రాంతాలు వాస్తవంగా ప్రకటించడం లేదు.. కేంద్రం కరువు ప్రాంతాల నిర్ధారణపై బృందాలను పంపకుండా నిద్రపోతోంది అని మండిపడ్డారు.
Read Also: Kishan Reddy: సీఎం కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ చీఫ్ బహిరంగ లేఖ
Also Read
మరోవైపు.. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎం.ఏ.బేబి మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య పోరాటంలో కూడా మిలిటెంట్ ఆర్గనైజేషన్ లు ఉన్నాయి.. నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ కలిసి సియోనిజమ్ ను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. నాలుగు రోజుల కాల్పుల విరమణకు పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య ఒప్పందం జరిగిందని తెలిసింది.. పాలస్తీనా అంశంపై పలువురు పలు రచనలు చేసారు.. మొదటి ప్రపంచ యుద్ధం నాటికి పాలస్తీనా కూడా బ్రిటిష్ హస్తాల్లో ఉండేది.. 1938, 1948 లలో పాలస్తీనా గురించి మహాత్మాగాంధీ మాట్లాడారని తెలిపారు.. అయితే, పాలస్తీనా స్వతంత్ర పోరాటం చేస్తోంది ఇప్పుడన్నారు.. వ్యవసాయ ఆధారిత 58 శాతం స్ధలం ఇజ్రాయిల్ కు వచ్చింది.. పాలస్తీన లిబరేషన్ ఆర్గనైజేషన్ గా పోరాటం జరిగిందన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎం.ఏ.బేబి.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!