NTV Telugu Site icon

CPI Ramakrishna: టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎంతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం..

Cpi Ramakrishna

Cpi Ramakrishna

కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేస్తోంది అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ‌చేతగాని దద్దమ్మ రాష్ట్రానికి సీఎంగా ఉండటం వలన రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది..
మోడీ సీఎం జగన్ ను కాపాడుతున్నారు.. వందల కోట్లు ఏపీలో స్కాంలు జరుగుతున్నా కేంద్రం సైలెంట్ గా ఉంది.. ఏపీలో లిక్కర్, ఇసుకలో కుంభకోణాలు జరుగుతున్నాయని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి స్వయానా కేంద్రానికి ఫిర్యాదు చేసింది.. ఏపీలో వస్తున్న అవినీతి ఆరోపణలపై సీబీఐతో కేంద్రం విచారణ జరిపించాలి అని ఆయన డిమాండ్ చేశారు. మళ్లీ జగన్ ఏపీకి సీఎం కావాలని స్లోగన్ తీసుకున్నారు.. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారని ప్రజలు జగన్ మళ్లీ సీఎం కావాలని అనుకుంటారు అని రామకృష్ణ అన్నారు.

Read Also: Toothpaste: దంతాలను శుభ్రం చేయడానికి టూత్‌పేస్ట్ ఉపయోగిస్తున్నారా.. ప్రమాదకరం..!

రాష్ట్రం అన్నీ రంగాలలో దివాలా తీసింది.. వై నాట్ 175 అని వైసీపీ అంటుంది.. అంటే దొంగ ఓట్లతో మళ్లీ జగన్ సీఎం కావాలని చూస్తున్నాడు అంటూ సీపీఐ రామకృష్ణ అన్నారు. ఇప్పటికే అన్నీ నియోజకవర్గాలకి వైసీపీ డబ్బు పంపింది.. జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు.. ఎఫ్ఐఆర్ లో పేర్లు నమోదు చేయకుండా చంద్రబాబుని ఎలా అరెస్ట్ చేస్తారు.. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపి ఉంది అని ఆయన ఆరోపించారు. బీజేపి చెప్పినట్లు ఏపీలో జగన్ పాలన నడిపిస్తున్నాడు.. నారా లోకేశ్ కి కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వక పోవటం దారుణం.. జగన్ విశాఖ పోయిన.. ఎక్కడికి పోయిన రాష్ట్రానికి ఏం ప్రయోజనం అని సీపీఐ రామకృష్ణ ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకొని పోయింది అని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు. జనసేన ఎన్డీయే జట్టులో టెక్నికల్ గా మాత్రమే ఉంది.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన పొత్తులతో ఎన్నికలకు వెళ్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు.