NTV Telugu Site icon

CPI Ramakrishna: పోలవరం నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే..

Cpi Ramakrishna

Cpi Ramakrishna

CPI Ramakrishna: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పిదప మీరు పోలవరం ప్రాజెక్టును సందర్శించి, ప్రాజెక్టు లోపాలపై మాట్లాడటం అభినందనీయం అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం పరిపూర్తికి కేంద్రానిదే బాధ్యత అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ కాలంలోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించాలి.. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన నిర్వాసితుల పునరావాస ప్యాకేజీకి రూ.33 వేలకోట్ల నిధుల విడుదలకై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని లేఖలో డిమాండ్‌ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ..

Read Also: Pawan Kalyan: మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం.. కోన వెంకట్ కీలక వ్యాఖ్యలు

కాగా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు.. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విషయం విదితమే.. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆరా తీసిన విషయం విదితమే. అంతేకాదు.. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందన్న సీఎం.. ప్రాజెక్టు కోసం నేను పడిన కష్టాన్ని జగన్‌ బూడిదలో పోసిన పన్నీరు చేశారని ఫైర్‌ అయ్యారు.. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించాను అను గుర్తుచేసుకున్నారు.. ప్రాజెక్టు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురయ్యాయి. జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంతో టీడీపీ హయాంలోనే 72 శాతం ప్రాజెక్టును పూర్తి చేశాం. 15 లక్షల క్యూసెక్కులు స్పిల్‌ వేపై డిశ్చార్జ్‌ అవుతాయి అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.