Site icon NTV Telugu

Ramakrishna: పొత్తుల కోసం బీజేపీ బెదిరింపులు, బ్లాక్ మెయిల్..?

Cpi Ramakrishna

Cpi Ramakrishna

Ramakrishna: ఎన్నికల్లో పొత్తుల కోసం బీజేపీ.. బెదిరింపులు, బ్లాక్‌ మెయిల్‌కి దిగుతుందంటూ మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. గుంటూరు మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ నేత సత్యకుమార్ పొత్తులపై చేసిన వ్యాఖ్యలు.. ఆదేశాలా? పొత్తుల కోసం బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? అని నిలదీశారు. సీఎం వైఎస్‌ జగన్‌ అరాచక పాలన చేస్తుంటే బీజేపీ మద్దతు ఇచ్చింది. రాష్ట్ర అధోగతి పాలవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే అన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టించడంలో బీజేపీ పూర్తి సహకారం ఉందని ఆరోపించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చంద్రబాబును జైలులో పెట్టించి ఇప్పుడు టీడీపీతో పొత్తు కోసం బెదిరిస్తున్నారని.. బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Revanth Reddy: యూపీఎస్సీ చైర్మన్‌తో సీఎం రేవంత్ భేటీ.. టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళనపై చర్చ..

తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి పరీక్ష జరుగుతుంది.. బీజేపీ బెదిరింపులపై టీడీపీ స్పందించాలని సూచించారు రామకృష్ణ.. అయితే, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీని గద్దె దింపెందుకు పూర్తి స్థాయిలో పని చేస్తాం అన్నారు. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు లక్షల సంఖ్యలో రోడ్డెక్కారు.. కానీ, వారి సమస్యలు పట్టకుండా.. ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రుల ట్రాన్సఫర్స్‌ పనిలో ముఖ్యమంత్రి మునిగి తేలుతున్నారని విమర్శించారు. చిలకలూరిపేటలో పనికిరాని మంత్రి.. గుంటూరులో ఎలా పనికి వస్తుందని? ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర సమస్యలను పరిష్కరించడంతో పాటు పార్టీ అధ్యక్షుడుగా పార్టీ పనులు చేసుకోవాలి.. అంతేగానీ పూర్తిగా పార్టీ పనిలో మునిగిపోయి రాష్ట్ర సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమయం కేటాయించి సమ్మెలో ఉన్న వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.

Exit mobile version