CPI Ramakrishna: భారతీయ జనతా పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. 2024 లో జరిగే ఈ ఎన్నికలు .. ఎన్నికలు కావు .. రిగ్గింగ్ ఎన్నికలని ఆరోపించారు. బీజేపీ ఈ ఎన్నికలలో మైండ్ గేమ్ ఆడుతుందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 400 స్థానాలు వస్తాయని చెబుతున్నారని, పదేళ్లు అధికారంలో ఉండి ఈ దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడి సీపీఐ రామకృష్ణ.. 2014, 2019 ఎన్నికలలో ఇచ్చిన హామీలు బిజెపి నిలబెట్టుకుందా..? అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాకముందు దేశంలో లీటర్ పెట్రోలు 71 రూపాయలు ఉండేది.. కానీ, ఇప్పుడు 110 రూపాయలు చేశారని, అప్పట్లో సిలిండర్ 400 రూపాయలు ఉండేది.. కానీ, ఇప్పుడు 900 రూపాయలకు చేరుకుందని దుయ్యబట్టారు. బీజేపీ హయంలో ధరలు పెరిగాయా? తగ్గాయా…? అనేది ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతియేటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. గతంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా బీజేపీ అమలు చేయలేదని ఆరోపించారు. ఇక, రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజును మనమంతా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
Read Also: Pawan Kalyan : అలా చేస్తే గులక రాయి విసిరిన చేయి వెనుక ఉన్నదెవరో బయటపడుతుంది!