Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana Assembly Elections 2023 Cpi Narayana Sensational Comments On Bjp Brs And Mim Over Telangana Assembly Elections 2023

CPI Narayana: రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి.. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే..!

Published Date :November 13, 2023 , 1:02 pm
By Sudhakar Ravula
CPI Narayana: రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి.. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

CPI Narayana: రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. రాష్ట్రంలో నిజంగా సీరియస్ గా పోటీలో ఉంటున్నారు అనేది రెండ్రోజుల్లో తేలబోతోదన్న ఆయన.. మాకు పొత్తులో భాగంగా కాంగ్రెస్, సీపీఎం, జన సమితి, వైఎస్‌ఆర్‌టీపీ మద్దతు ప్రకటించాయి అని తెలిపారు. రాష్ట్రంలో అనేక సమస్యలతో సతమతమవుతున్నారు.. నియామకాల విషయంలో నిరుద్యోగులను మోసం చేసింది బీఆర్ఎస్‌ పార్టీ.. దళిత బంధు పేరుతో అనేక ఇబ్బందులు పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది నిజమే అయినప్పటికీ.. అనేక చోట్ల డ్యామేజ్‌ జరిగింది.. పిల్లర్లు డ్యామేజ్‌ అయ్యింది మొదటిసారి… గతంలో కట్టిన ప్రాజెక్ట్ ల్లో అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లర్లు దెబ్బ తినడం ఏంటీ అసలు? ఇసుకపై కట్టడం ఏమిటీ? అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్‌ వారి ఫామ్ హౌస్ లు కళకళలాడుతున్నాయి… 15 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే ఎలా 2 వందల ఎకరాలకు వెళ్లింది? కొండపోచమ్మ ప్రాజెక్ట్ డైరెక్ట్ గా ఫామ్ హౌస్ లోకి ఎలా వెళ్తున్నాయి..? అని ప్రశ్నించారు నారాయణ.. కొత్తగా ఏ ప్రాజెక్ట్ వచ్చినా కల్వకుంట్ల కుటుంబానికి షేర్ ఉండాల్సిందే.. చిన్న మాల్ పెట్టిన షేర్ ఉండాల్సిందే.. హైదరాబాద్‌ చుట్టుపక్కల జరిగిన ప్రతి డెవలప్‌మెంట్‌ లో కల్వకుంట్ల కుటుంబానికి షేర్‌లు లేకుండా లేవు.. తీగల బ్రిడ్జిల్లో కూడా షేర్ లతోనే కట్టారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు.. అవినీతిని అయినా జనాలు ఒకానొక దశలో ఒప్పుకుంటారెమో.. కానీ, కల్వకుంట్ల కుటుంబానికి అహం పెరిగిపోయింది.. ఈ అహంతోనే ఈసారి అధికారం కోల్పోతున్నారు. ఈ అహనికి పునాదులు ఢిల్లీ లో ఉన్నాయి.. బీజేపీ అండ చూసుకుని బీఆర్ఎస్‌ ఇంతలా అహాన్ని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.

Also Read

  • Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
  • KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
  • Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
  • Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..

బీజేపీ, బీఆర్ఎస్‌, వైసీపీ ముగ్గురు కలిసి దేశంలో డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు నారాయణ.. జైల్ లో ఉండాల్సిన వారు బయట ఉంటున్నారు.. బయట ఉండాల్సిన వారు జైల్ లో ఉంటున్నారన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేసే రోజు రాష్ట్ర , కేంద్ర సంస్థలు దాడులు చేశాయని గుర్తుచేశారు. కానీ, ఈ రోజు సబితా ఇంద్రారెడ్డిపై చేసేది నిజమైన ఐటీ దాడులు కాదన్నారు. ఇక, ప్రధాని బీసీ, ఎస్సీ సభలు అంటున్నారు.. గతంలో చాలా సార్లు మందకృష్ణ ప్రధానిని కలిసే ప్రయత్నం చేశారు.. ఎన్నిసార్లు ప్రయత్నించినా కలవని ప్రధాని.. ఇప్పుడు ఎందుకు కలిశారు..? అని నిలదీశారు. ఎందుకు అన్ని డ్రామాలు ఆడారు స్టేజ్ పై.. మంచి నటులు కూడా అంతబాగా నటించరేమో.. అంటూ ఎద్దేవా చేశారు. కానీ, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ సీట్లు పెరగవు.. బీజేపీ కన్నా నోటా ఓట్లు ఎక్కువ వస్తాయి.. బీజేపీ.. బీసీ, సామాన్యులకు, మైనారిటీ, ఎస్సీలకు వ్యతిరేకులు అని వ్యాఖ్యానించారు.

కేంద్రంలో కూడా బీజేపీ పడిపోతుందని వారికి అర్థమైంది.. అందుకే అంత ఫ్రస్టేషన్ లో ఉన్నారన్నారు నారాయణ.. ఎన్నికలు కాబట్టి ఇన్నిసార్లు తెలంగాణకి తిరుగుతున్నారు.. జనగణన ఎందుకు అమలు చేయడం లేదు, మహిళా బిల్లు ఎందుకు అమలుకు నోచుకోవడం లేదు.. సరిగ్గా ఎన్నికల సమయం రాగానే రాముడు గుర్తొస్తాడు.. దేవాలయాలు గుర్తుకు వస్తాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కే అద్వానీ సమయంలో బీజేపీని బాగా ఊపుమీదకు తీసుకొచ్చారు… కానీ, అద్వానీని పక్కన పడేశారు ప్రధాని మోడీ.. సొంత పార్టీలో ఉండి అద్వానీకి కూడా ముఖ్యమైన పదవులు దక్కనియ్యలేదు.. పార్టీ లోపల, బయట అన్నింటా అణిచివేతకు తెగపడుతున్నరు.. అన్ని సంస్థల్లో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తోంది బీజేపీ అని దుయ్యబట్టారు.. ఇక, బీఆర్‌ఎస్‌కి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని విమర్శించారు.. ఆర్థిక వ్యవస్థ నీ కల్వకుంట్ల కుటుంబానికి అనుకూలంగా మలుచుకున్నాయి.. 17 మంది మంత్రివర్గం లో తెలంగాణ కోసం ఉద్యమించిన వారు ఎంతమంది…? అని ప్రశ్నించారు. మిగితా అంతా తెలంగాణ ద్రోహులేగా? రాజకీయంగా దివాలోకొరుగా మార్చింది బీఆర్ఎస్‌.. నంబర్ వన్ దొంగలు ఎంఐఎం.. వారితో బీఆర్ఎస్‌కు స్నేహం ఏమిటి? అని నిలదీశారు.. బీజేపీ, బీఆర్ఎస్‌, ఎంఐఎంకి ఓటు వేయొద్దు.. ఒక్కదెబ్బకు అంటే ఒక్క ఓటు కి మూడు పిట్టలు పడిపోవాలి.. కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ కి ఓటు వెయ్యండి.. బీఆర్ఎస్‌ని గద్దె దింపండి అంటూ పిలుపునిచ్చారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AIMIM
  • bjp
  • BRS
  • cm kcr
  • cpi

తాజావార్తలు

  • Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!

  • Donald Trump: ట్రంప్‌ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి

  • KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..

  • Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

  • Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions