NTV Telugu Site icon

CPI Narayana: ఎలక్టోరల్ బాండ్లను మొదటి నుంచి వ్యతిరేకించాం.. నారాయణ కీలక వ్యాఖ్యలు

Narayana

Narayana

ఎలక్టోరల్ బాండ్లను మొదటి నుంచి తాము వ్యతిరేకించినట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ తెలిపారు. రాజకీయాలను ధ్వంసం చేసేందుకే ఎలక్టోరల్ బాండ్లను తీసుకొచ్చారని మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ఎస్బీఐ వ్యవహారశైలి సరిగా లేదు.. ఎస్బీఐ దగ్గర వివరాలు అందించే టెక్నాలజీ లేదా ? అని ప్రశ్నించారు. సమయం లేదు అని దొంగలను కాపాడేందుకే ఎస్బీఐ వివరాలు సరిగా ఇవ్వలేదని విమర్శించారు. ఏ పార్టీకి ఇచ్చారో సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఎవరెవరికి, పార్టీలకు ఎంత ఇచ్చారో లెక్క తేలాలని నారాయణ పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన లెక్కలు చెప్పాల్సిందే.. పారదర్శకత ఉండాల్సిందేనని నారాయణ తెలిపారు.

Nirmal: బ్లాక్ మెయిలర్లు, చీటర్లు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు.. కాంగ్రెస్ నేతల నిరసన

దొంగలను, రాజకీయ పార్టీలను కాపాడేందుకు చేసే ప్రయత్నం సరికాదని నారాయణ ఆరోపించారు. లెక్కలు ఇవ్వని అధికారులను విచారణ చేసి జైల్లో వేయాలని పేర్కొన్నారు. అధికారుల వెనుక కేంద్ర పెద్దలున్నారు.. ప్రధాని, కేంద్ర హోంమంత్రి బాధ్యత వహించాలని తెలిపారు. రాజకీయాలను ధ్వంసం చేసేందుకే ఎలక్ట్రోరల్ బాండ్లను తీసుకొచ్చారు.. క్విడ్ ప్రో కో లాభపడిన అందరి వివరాలు బయటకు రావాలని ఆయన కోరారు.

Palle Sindhura Reddy: తొలిరోజు ప్రచారంలోనే టీడీపీ అభ్యర్థికి అస్వస్థత..

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. ఎస్‌బీఐ అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. అయితే, ఆ వివరాల్లో ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన కొన్ని సంస్థలపై గతంలో సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయనే అంశం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. డేటా ప్రకారం, రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళం ఇచ్చిన మొదటి 30 కంపెనీల్లో 15 కంపెనీలకు పైగా ఈడీ, సీబీ, ఆదాయ పన్ను శాఖల నుంచి దర్యాప్తును ఎదుర్కొన్నాయి.