CPI Narayana: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్‌పై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షాలకు తెలియకుండా చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయగలరా అని వ్యాఖ్యానించారు. అమిత్ షా అనుమతితోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ వ్యవహారం వెనుకాల ఎవరున్నారో చంద్రబాబు ఇప్పటికైనా తెలుసుకోవాలని నారాయణ పేర్కొన్నారు. చంద్రబాబు తనను బీజేపీ కాపాడుతుందని భ్రమల్లో వున్నారని.. ఇప్పటి రాజకీయాలు ఏంటో తెలుసుకోవాలని సూచించారు. బీజేపీ సాయం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం సాధ్యం కాదన్నారు. బీజేపీని, వైసీపీని దూరంగా పెడితే తప్ప తెలుగు ప్రజలకు న్యాయం జరగదు అని నారాయణ స్పష్టం చేశారు.
Read Also: World Bank Chief: భారత్ జీ20 ప్రెసిడెన్సీ ప్రపంచానికి మార్గాన్ని నిర్దేశించింది..
అంతకుముందు శనివారం నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టు వైసీపీ అరాచక పాలనకు పరాకాష్ట అని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఎటువంటి ఆధారాలు చూపించకుండా పోలీసులు అరెస్ట్ చెయ్యడం వైసీపీ దుర్మార్గపు పాలనకు అద్దం పడుతోందని ఆరోపించారు. అంతేకాకుండా.. వైసీపీ పాలనలో రెండు రకాల పాలన సాగుతోందని తెలిపారు. అందులో ఒకటి రివర్స్ టెండెరింగ్, రెండోది రివేంజ్ పాలన చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంను పక్కన పెట్టి పరిపాలన కొనసాగిస్తుండడం దుర్మార్గం అన్నారు. వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలలో భాగంగా చంద్రబాబు ను అరెస్ట్ చెయ్యడం సీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
Read Also: Jasmine Pruning: మల్లెలో కొమ్మ కత్తిరింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..