AR Rahman : నా వర్కింగ్ స్టైల్ గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి అభియానులు ఉన్నారో తెలిసిందే.. ఆయన తమిళంలో కాదు, అనేక భాషల్లో పనిచేశారు. హిందీలో కూడా ఆయనకు చాలా డిమాండ్ ఉంది. అలాంటిది ఇటీవల ప్రముఖ గాయకుడు అభిజీత్, సంగీత రంగంలో వస్తున్న మార్పుల పై స్పందిస్తూ.. ఏఆర్ రెహమాన్ పై వైరల్ కామెంట్స్ చేశాడు.. ‘రెహమాన్ ఎక్కువగా సింగర్‌లకు బదులు.. టెక్నాలజీని ఉపయోగించి ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారన్నారు. దీనివల్ల ఎంతో మందికి ఉపాధి లేకుండా పోతుంది’ అని తెలిపారు. అయితే తాజాగా అభిజీత్ మాటలపై రెహమాన్ రియాక్ట్ అయ్యారు..
Also Read: Rashmika : బంధం బలంగా ఉండాలంటే ఒకే ఒక రూల్ చాలు..
Also Read
‘అభిజీత్ నాపై ఎలాంటి విమర్శలు చేసినా, నేను ఆయన్ని గౌరవిస్తూనే ఉంటాను. ఆయన అంటే నాకెంతో అభిమానం, ప్రేమ.. నాపై ఆయనకు ఉన్న అభిప్రాయాన్ని నేను ఏమాత్రం తప్పుపట్టను. ఎందుకంటే ప్రతి విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. అన్ని విషయాలకు నన్ను తప్పుపట్టడం బాగానే ఉంది. కానీ దుబాయ్ వేదికగా ఇటీవల ఒక మహిళా ఆర్కెస్ట్రా బృందాన్ని సిద్ధం చేశా. అందులో సుమారు 60 మంది మహిళలు ఉన్నారు. వారికి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి నెలా జీతం ఇస్తూ, వాళ్ల కోసం ఆరోగ్య, జీవిత బీమా కడుతున్నా అంతేకాకుండా ‘పొన్నియిన్ సెల్వన్’, ‘ఛావా’ వంటి సినిమాల కోసం వర్క్ చేసినప్పుడు, సుమారు 200 మంది సంగీతకారులను అందులో భాగం చేశా. కొన్నిసార్లు కేవలం పాటల కోసమే 100 మందికి పైగా వర్క్ చేస్తుంటారు. ఆ విషయాలను నేను ఎక్కడ బయట పెట్టను. అలాగే దానికి సంబందించిన ఫోటోలను పంచుకోను. అందుకే ఎవరికీ నా వర్కింగ్ స్టైల్ గురించి పెద్దగా అవగాహన ఉండదు’ అని ఆయన వివరణ ఇచ్చారు.
- Tags
- AR Rahman
- Singer Abhijit
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!