Site icon NTV Telugu

CPI Narayana: మోడీ ఆర్ధిక ఉగ్రవాది.. కేంద్రంలో ఉన్నది క్రిమినల్ గవర్నమెంట్

Narayana

Narayana

విజయవాడలో నిర్వహిస్తున్న పొలిటికల్ సెమినార్ లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. .. పవన్ కళ్యాణ్ కి ఏమీ లేకపోయినా బీజేపీతో ఉన్నాడు.. ఏపీలో ముగ్గురు నేతలు ఉత్సవ విగ్రహాలే అని ఆయన విమర్శించారు. మోడీ కలలు కంటున్నాడు.. ఆ కలలు నిజం అయ్యే అవకాశాల్లేవు.. రాజకీయ సదస్సు నిర్వహించడం సంతోషకరం.. విజయ్ మాల్యా తప్ప మిగిలిన 28 మందీ గుజరాతీలే.. కాంగ్రెస్ పార్టీది రీటైల్ కరప్షన్.. మోడీది హోల్ సేల్ కరప్షన్ అని ఎద్దేవా చేశారు.. రాజ్యాంగానికి మోడీ వల్ల ప్రమాదం పొంచి ఉందని సీపీఐ నారాయణ విమర్శలు గుప్పించారు.

Read Also: Bootcut Balaraju: ఓటీటీలోకి వచ్చేస్తున్న బిగ్‌బాస్ సోహెల్ బూట్‌కట్ బాలరాజు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఇక, ప్రధాని మోడీ నాలుగు వందల సీట్లు గెలుస్తామనడం హాస్యాస్పదం అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీ మోతలా ఉంది మోడీకి.. పాకిస్తాన్ బార్డర్ కంటే ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఢిల్లీ బార్డర్ లో అని పేర్కొన్నారు. భారత దేశ అధ్యక్షురాలికి అవామానం జరిగింది.. సీబీఐని కూడా మోడీ ఆక్యుపై చేసాడు.. ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీంకోర్టు తీర్పు అద్భుతం.. నాలుగో స్ధానంలో ఉన్న అధికారిని ఈసీగా తెచ్చిపెట్టారు.. భారతదేశంలో వ్యవస్థీకృత రాజకీయాలు ధ్వంసం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. బీజేపీ శనక్కాయలు అమ్మినట్టు పబ్లిక్ సెక్టార్లను అమ్ముతోంది.. బలహీనమైన ప్రధాని వీపీ సింగ్‌.. రోజుకు నాలుగు డ్రెస్ లు మార్చే బలమైన ప్రధాని మోడీ అంటూ నారాయణ ఎద్దేవా చేశారు.

Read Also: Medaram Jathara: మేడారం జాతరకు రూట్‌మ్యాప్ ఇదే.. ఫాలో అవ్వండి..

ప్రపంచ సుందరుల పోటీ పెడితే ప్రథమ స్ధానం మోడీదేనంటూ సీపీఐ నారాయణ ఆరోపించారు. అమిత్ షా హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి 12 మందిని చంపి నిర్దోషి అయ్యాడు.. ఇక, ప్రధాని మోడీ ఆర్ధిక ఉగ్రవాది.. అత్యంత క్రిమినల్ గవర్నమెంట్ మన కేంద్రంలో ఉంది అని ఆయన విమర్శించారు. రాజకీయాల్లో విబేధిస్తాం.. శతృత్వం ఉండదు.. చంద్రబాబు, జగన్ ఒకేలా అనేది నా ఉద్దేశం కాదు అన్నారు. మోడీతో కలిసిన వారు కూడా మాకు శతృవులే.. ఏపీలో బలమైన పార్టీ వైసీపీ, ఎందుకు బీజేపీ ముందు మోకరిల్లుతుంది.. ఇండియా కూటమిలోకి ఎవరు వచ్చినా కలుపుకుందాం అని నారాయణ వెల్లడించారు.

Exit mobile version